Wednesday, March 23, 2011





టాబ్లెట్ పిసి ... ఏమి దాని కథ?

Tablet PC.. దీనిని చూసిన వారికన్నా ఈ పదం విన్నవారే ఎక్కువుంటారు. కంప్యూటర్ల వినియోగం ఊపందుకున్న తర్వాత Laptops,Desktop,Tablet PC, Pocket PC వంటి వేర్వేరు రూపాల్లో కంప్యూటర్ లక్షణాలు కలిగున్న డివైజ్‌లు ఆవిర్భవించాయి. అలాంటి వాటిలో Tablet PC ఒకటి. దాని పేరుకు తగ్గట్టే పేపర్ టాబ్లెట్ పరిమాణంలో ఉంటుందీ పిసి. టాబ్లెట్ పిసి స్క్రీన్‌పై నేరుగా డిజిటల్ పెన్ సహాయంతో పేపర్‌పై ఎలా రాస్తామో అదే విధంగా రాయవచ్చు. నోట్‌బుక్ కంప్యూటర్ల కన్నా మరింత సులువుగా ఒక చోటి నుండి మరో చోటికి తీసుకు వెళ్ళగలిగేలా ఈ టాబ్లెట్ పిసిలను రూపొందించారు. వీటి కోసం అనేక మౄదులాంత్రాలు(Software) లభిస్తున్నాయి. ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడవచ్చు?Tablet PC కోసం మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రత్యేకంగా XP ఆపరేటింగ్ సిస్టమ్‌ని రూపొందించింది. Windows XP Pro Tablet PC Edition పేరిట విడుదల చేయబడిన ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ని ఒక్క పైసా చెల్లించనవసరం లేకుండా వాడుకోవచ్చు. అంటే ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ ప్రత్యేకమైన ఎడిషన్ కోసం సర్వీస్ ప్యాక్2 కూడా విడుదల చేయబడింది. SP2ని Tablet PCలో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్ సదుపాయాలు, ఇన్‌పుట్ ప్యానెల్ మరింత మెరుగుపరచబడ్డాయి. టాబ్లెట్ పిసినే ఎందుకు ఎంచుకోవాలి?పోర్టబులిటీ, ప్రయోజనాల రీత్యా టాబ్లెట్ పిసి లాప్‌టాప్‌లు,PDA డివైజ్‌ల స్థానంలో ప్రత్యామ్నాయంగా వాడబడుతోంది. కీబోర్డ్ వాడడానికి వీల్లేని మీటింగ్‌లు, క్లాసులు వంటి ప్రదేశాల్లో TableT PCని ఎంచక్కా వాడుకోవచ్చు. ఇందులో మన రాసే రాతల్ని అక్షరాలుగా మార్చే హ్యాండ్ రికగ్నిషన్ టెక్నాలజీ లభిస్తోంది. బ్యాటరీ ఎక్కువ కాలం వస్తుంది. ప్రొసెసర్ తక్కువ వేడికి గురవుతుంది. Windows XP ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు అనేక థర్డ్‌పార్టీ అప్లికేషన్లు లభిస్తున్నాయి. టాబ్లెట్ పిసితో పాటు అందించబడే పెన్‌ని ఉపయోగించి ఆపరేటింగ్ సిస్టమ్‌లోని, అప్లికేషన్లలోని మెనూలను యాక్సెస్ చేయవచ్చు. బరువు పరంగా కూడా నోట్‌బుక్‌లతో పోలిస్తే మూడు పౌండ్లకు మించి టాబ్లెట్ పిసిలు బరువు ఉండవు. డిజిటల్ పెన్‌ని సురక్షితంగా పెట్టుకోవడానికి Tablet PCలో అమరిక ఉంటుంది. టాబ్లెత్ పిసిలో కీబోర్డ్లను సైతం కనెక్ట్ చేసుకోగలిగే మోడళ్ళూ ఉన్నాయి. ప్రాసెసర్ వేగంటాబ్లెట్ పిసిల కోసం ఇంటెల్ Centrino, Dothan వంటి ప్రొసెసర్లు వాడుకలో ఉన్నాయి. క్లాక్‌స్పీడ్ విషయంలో ఆ ప్రొసెసర్లు నోట్‌బుక్‌ల్లో వాడబడే మొబైల్ ప్రొసెసర్ల కన్నా వేగంగా పనిచేస్తాయి. ఉదా.1.66GHz క్లాక్ స్పీడ్ కలిగిన టాబ్లెట్ పిసి ప్రొసెసర్ 2.4GHz క్లాక్ స్పీడ్ కలిగిన Pentium4-M ప్రొసెసర్ కన్నా వేగంగా పని చేయగలుగుతుంది. తక్కువ ఓల్టేజ్‌పై రన్ అవడమే దీనిక్కారణం. Tablet PCలోని మెమరీని కూడా అవసరాన్ని బట్టి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక హార్డ్‌డిస్క్ విషయానికి వస్తే 60GB నుండి 120GB స్టోరేజ్ కెపాసిటీ కలిగిన హార్డ్‌డిస్కులు వీటిలో వాడబడుతున్నాయి. కొన్ని అధునాతన టాబ్లెట్ పిసిల్లో సిడిలను, డివిడిలను రీడ్ చేస్తూ సిడిలను రైట్ చేయగల CDRW -DVD డ్రైవ్‌లు సైతం లభిస్తున్నాయి. కొన్ని పిసిల్లో USB,Firewire పోర్టులు కూడ అమర్చబడి ఉంటున్నాయి. విడిగా లభించే సిడి,డివిడి డ్రైవ్‌లను సైతం టాబ్లెట్ పిసికి కనెక్ట్ చేసుకోవచ్చు

No comments:

Post a Comment