HTML

HTML2

Monday, June 20, 2011

H

వన్స్ ట్రై చేద్దామా...?


పుంటికూర కాదు గోంగూర
అనపకాయ కాదు సోరకాయ
ఆలుగడ్డ కాదు బంగాళదుంప
తొవ్వ కాదు దారి
మెత్త కాదు దిండు
పేలాలు కాదు ముర్‌మురాలు
తాలింవు కాదు పోపు
యాది కాదు గుర్తు
ఓల్లు కాదు ఎవరు
బాపు కాదు నాన్న
కాకా కాదు చిన్న నాన్న
అవ్వ కాదు అమ్మ
తొల్కపోతా కాదు తీసుకెళ్తా
సల్ల కాదు మజ్జిగా
లగ్గం కాదు పేళ్ళి
శేను కాదు పోలం
బాయికాడికి కాదు పోలం దగ్గరకు
పెయ్యి కాదు ఒళ్ళు
బిర్యాణి కాదు పలావు
సర్ధి కాదు జలుబు
నాగలి కాదు అరక
తొక్కు కాదు పచ్చడి
ఠొంగా కాదు మొట్టికాయ
మాలాసా కాదు చాలా
పతంగి కాదు గాలి పటము
శెక్కర కాదు పంచదార
మైదాకు కాదు గోరింటాకు
కర్బుజా కాదు పుచ్చకాయ
పల్లిలు కాదు వేరుశనగా
కల్యమాకు కాదు కరివేపాకు
నేత్తినోప్పి కాదు తలకాయనోప్పి
సందుకు కాదు ట్రాంకుపేట్ట
కోబ్బరికాయ కాదు టేంకాయ
పఠాకులు కాదు టాపాకాయలు
సప్పుడు కాదు శబ్ధం
దోస్తులు కాదు మిత్రులు
దసరా కాదు విజయదశమి
మరి ఇంకెందుకు రా బాయ్ కలిసుండుడు. నీ దారిలో నువ్వు బతుకు. నా తొవ్వల నేను బతుకుతా. జరా సోచో బాయ్. నిమ్మలంగ సొంచాఇస్తే మంచి మత్లవులు అస్తాయని మా దగ్గర సమేత.... వన్స్ ట్రై చేద్దామా...?

No comments:

Post a Comment