ఆధార్ సంఖ్యను గురించి ప్రజల్లో ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇటీవల
రెండు, మూడు సార్లు వివిధ మీడియా సంస్థలు ఆధార్ భధ్రత
సరిగా లేదని రిపోర్టు చేశాయి. దీంతో ఆధార్ విషయంలో చాలా మందికి అనుమానాలు నెలకొన్నాయి.
దీంతో యూఐడీఏఐ దీనికి సంబంధించి పలు ప్రశ్నలు, సమాధానాలను
తన వెబ్‌సైట్లో ఉంచింది అవి మీ కోసం...
1. యూఐడీఏఐ
వద్ద నా వేలిముద్రలు, బ్యాంకు ఖాతా, పాన్
వివరాలు ఉన్నాయి. దీంతో నా ప్రతి పనిని ఆధార్ సంస్థ ట్రాక్ చేస్తుందా? లేదు. యూఐడీఏఐ దగ్గర డేటాబేస్లో ఈ కింది వివరాలు మాత్రమే ఉంటాయి.
పేరు, చిరునామా, పుట్టిన
తేదీ, జెండర్(లింగం) 10 వేలి
ముద్రలు, రెండు కనుపాపలు, మీ ముఖ
చిత్రం మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ
2. నా బ్యాంకు ఖాతా, షేర్లు,
మ్యూచువల్ ఫండ్లు, మొబైల్ ఫోను వంటి వివరాలను ఆధార్ సంఖ్యతో
లింక్ చేసినప్పుడు యూఐడీఏఐ ఈ సమాచారం అంతా యాక్సెస్ చేయలేదా? లేదు. ఆయా వాటికి ఆధార్ లింకింగ్ జరిగినప్పుడు ఆయా సంస్థలు కేవలం
మీ ఆధార్ సంఖ్య, బయోమెట్రిక్ వివరాలను మాత్రం మాతో
పంచుకుంటారు. అది కూడా మీ గుర్తింపును తనిఖీ చేయడానికి మాత్రమే. వారు బ్యాంకు
ఖాతా లేదా ఇతర వివరాలను పంపరు. కాబట్టి మీ వ్యక్తిగత సమాచార భద్రతకు
డోకా లేదు.
3. ఎవరికైనా
నా ఆధార్ నంబరు తెలిస్తే, వారు సులువుగా నా బ్యాంక్ ఖాతాను హ్యాక్ చేయొచ్చు
కదా? ఇది పూర్తిగా తప్పు. ఎట్లైతే మీ ఏటీఎమ్ కార్డు
నంబరు తెలిస్తే ఏటీఎమ్ యంత్రం నుంచి నగదు విత్ డ్రా చేయలేరో, అదే విధంగా మీ ఆధార్ నంబరు తెలిసినంత మాత్రాన మీ బ్యాంకు ఖాతా వివరాలను
తెలుసుకుని డబ్బు తీసుకోలేరు. మీ బ్యాంకు మీకు ప్రతిసారి పిన్, ఓటీపీ సెక్యూరిటీ ఇచ్చినంత కాలం మీ బ్యాంకు ఖాతా వివరాలు భద్రంగానే
ఉంటాయి.
4. ఎందుకు నేను నా అన్ని బ్యాంకు ఖాతాల వివరాలను
ఆధార్ సంఖ్యతో లింక్ చేయాలి? మీకు తెలియకుండా మోసగాళ్లు, మనీ లాండర్లు, క్రిమినల్స్ మీ పేర్లతో నిర్వహించే ఖాతాలతో
ఇబ్బంది లేకుండా ఉండేందుకు మీ రక్షణ కోసం భద్రతా కారణాల రీత్యా మీరు ఆధార్
సంఖ్యతో బ్యాంకు ఖాతాల వివరాలను అనుసంధానించాల్సిందే. ఎవరైనా మోసగాళ్లు మీ ప్రమేయం
లేకుండా మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బు తీసినట్లైతే ఆధార్ సాయంతో అలాంటి వారిని
సులువుగా గుర్తించి, శిక్షించవచ్చు.
5. ఆన్‌లైన్లో మొబైల్ నంబరును నమోదు చేయడం గానీ
లేదా మార్పు చేయడం కానీ చేయవచ్చా? ఆన్‌లైన్‌లో చేసే ఏ మార్పు కోసమైనా
నివాసి ముందుగా పనిచేసే మొబైల్‌ను ఓటీపీని పొందడానికి, అధీకృతం
చేయడానికి సిద్దంగా ఉండాలి. లేనియెడల దగ్గర్లోని శాశ్వత ఆధార్ నమోదు
కేంద్రానికి వెళ్లి ఈ సదుపాయాన్ని పొందవలెను. ప్రతి ఒక్కరూ ఆధార్ నంబరుతో,
మొబైల్ నంబరును లింక్ చేసినట్లైతే, మొబైల్
నంబరును వాడుకొని మోసగాళ్లు, నేరగాళ్లు, తీవ్రవాదులను
గుర్తించడం సులువు అవుతుంది.
6. మొబైల్ స్టోర్లో నేను ఆధార్ నంబరు
ఇస్తాను, దాన్ని వాళ్లు ఏ ఇతర అవసరాల కోసమైనా వాడుకోవచ్చా?
మొబైల్ సిమ్ కొనేటప్పుడు మీరు ఇచ్చిన ఆధార్ వివరాల కారణంగా ఎవరూ
అంటే మొబైల్ స్టోర్ లేదా మొబైల్ నెట్వర్క్ కంపెనీలు సైతం ఆయా వివరాలను లేదా బయోమెట్రిక్
సమాచారాన్ని స్టోర్ చేసుకోలేరు. బయోమెట్రిక్ వివరాలన్నీ ఎన్ క్రిప్ట్ అయి
ఉంటాయి.
7 .ఎన్నారైలకు బ్యాంకింగ్, మొబైల్,
పాన్ మరియు ఇతర సేవలకు ఆధార్ అవసరమా? ఆధార్
అనేది భారతదేశంలో నివసించే వారు మాత్రమే పొందే అవకాశం ఉంది.ఎన్నారైలకు ఆధార్ పొందే
అవకాశం లేదు.బ్యాంకు మరియు మొబైల్ సంబంధిత సర్వీస్ ప్రొవైడర్లు ఎన్నారై
మినహాయింపులు చేసారు.ప్రవాస భారతీయులు కావడం వల్ల బ్యాంకులకు మరియు ఇతర సేవలు
పొందేందుకు ఆధార్ నిబంధన వర్తించదని వెల్లడించారు.
8. ఆధార్ లేనందున పేదప్రజలకు రేషన్ మరియు పెన్షన్
ఇవ్వడం ఆపేస్తారా? లేదు.ఆధార్ చట్టం 7
ప్రకారం ఆధార్ లేని పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆపేయివేయటం జరగదని స్పష్టం
చేసారు.ఆధార్ గుర్తింపు లేని వారికీ ఇతర గురింపు కార్డులను అధికారులు గుర్తించి
వారికీ అర్హత కల్పిస్తుంది.
9 . ఈ-ఆధార్ కొన్ని సంస్థలు అంగీకరించటం లేదు,ఇది అసలు ఆధార్ గుర్తింపు కాదా? ఈ-ఆధార్
అనేది UIDAI వెబ్సైట్ నుండి చట్టబద్ధంగా చెల్లుతుందని అసలు
ఆధార్ జారీచేసేది UIDAI నే అని తెలిపారు.ఇవి రెండు ప్రభుత్వం
నెలకొల్పినవని అన్ని ఏజెన్సీలు ఆమోదించాలని వెల్లడించారు.నిజానికి ఆధార్ హోల్డర్స్
యొక్క ఇ-ఆధార్ చిరునామా అప్డేట్ చెయ్యబడింది అందువలన దీనికి ప్రాధాన్యం
ఎక్కువ.ఎవరైనా డౌన్లోడ్ చేసిన ఇ-ఆధార్ను అంగీకరించకపోతే,సదరు
ఆధార్ కార్డు వ్యక్తి విభాగ సంస్థ ఉన్నత అధికారులకు ఫిరియాదు చేయాల్సిందిగా
కోరారు.
10.ఆధార్ సామాన్యుడికి ఏవిదంగా ఉపయోగ పడుతుంది?
ఆధార్ విశ్వసనీయ గుర్తింపుతో 119 కోట్ల
మంది భారతీయులకు గుర్తింపు లభించింది.వాస్తవానికి ఆధార్ అనేది భారతదేశంలో ఏ యితర
గుర్తింపు కన్నా చాల ధృడమైనది అని విశ్వసం వ్యక్తం చేసారు.ఆధార్ అనేది ప్రస్తుత
రోజుల్లో చాల న్ముఖ్యమైనది,ఉద్యోగం చేయాలన్న సదరు సంస్థవారికి మనయొక్క ఆధార్
గుర్తింపు సమర్పించాలి,అంతేకాదు రైలు ప్రయాణం లో కూడా ఆధార్ చాల
ఉపయోగపడుతుందని,బ్యాంకు ఖాతాలు తెరవటానికి మరియు ప్రభుత్వం నుండి
వచ్చే అన్ని పథకాలు నేరుగా బ్యాంకు నుండి ఎటువంటి మధ్యవర్తి లేకుండా వచ్చి
చేరుతాయని తెలిపారు.
11.ఆధార్ డేటా ఉల్లంఘించినట్లు మీడియాలో వస్తున్నా
ఖథనాలు నిజమేనా? ఆధార్ డేటాబేస్ గత 7 సంవత్సరాలలో ఎన్నడూ ఉల్లంఘించలేదని
వెల్లడించారు.అందరి ఆధార్ వివరాలు సురక్షితంగానే ఉన్నాయని మీడియాలో వస్తున్న
ఖథనాలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.UIDAI
ప్రస్తుతం
వాడుతున్న పరిజ్ఞానం అత్యంత పటిష్టకరమైందని ఉల్లంఘించే అవకాశం లేదని స్పష్టం
చేసింది.
Untuk artikel berikut ini adalah panduan tentang Cara Main 4D 3D 2D pada permainan togel (toto gelap) yang tersedia di S128cash tentunya. Sebelumnya sudah kami jelaskan cara pasang 2D dimana 2 angka yang kamu pilih bisa kamu letakkan di 3 sisi, yaitu Apakah benar ada Robot ? Apa yang robot itu lakukan ? (Baca Selengkapnya Disini...)
ReplyDelete