బ్యాంక్ లావాదేవీలు జర జాగ్రత్త
ఇంటర్నెట్ సదుపాయం అన్ని ప్రాంతాల్లోకి విస్తరించిన తర్వాత ఆన్‌లైన్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ కొనుగోళ్ళు, నిధుల బదిలీలు వంటి పనుల్ని ఎవరికి వారు తమ పిసి ముందు కూర్చుని చేసుకోగలుగుతున్నారు. అయితే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు తస్కరించే ఫిషింగ్ స్కామ్‌లు, కీలాగర్లు వంటి అనేక ప్రమాదాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోగలిగితేనే ఆన్‌లైన్‌లో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోవాలి. మీరు లావాదేవి జరిపినా లేకున్నా తరచూ మీ బ్యాంక్ ఎకౌంట్‌ని తనిఖీ చేసుకుంటూ ఏవైనా తప్పుడు ఎంట్రీలు కనిపించినట్లయితే ఆలస్యం చెయ్యకుండా మీ బ్యాంక్‌బ్రాంచ్‌కి ఫిర్యాదు చేయండి. క్రెడిట్‌కార్డ్ ఉన్నట్లయితే వాటీని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసే సదుపాయం ఉంటే వాటిపైనా ఓ కన్నేసి ఉంచండి. ఆన్‌లైన్ బ్యాంకింగ్ వెబ్‌సైట్లు లాగిన్ అయిన తర్వాత https:// అనే ప్రోటొకాల్ (వెబ్‌సైట్ అడ్రస్ ఇలా ప్రారంభమవుతుంది) కలిగిన వెబ్‌పేజీ ఓపెన్ అయితేనే మీరు నిజమైన బ్యాంకింగ్ సైట్‌కే కనెక్ట్ అయినట్టు లెక్క. ఇంటర్నెట్ ద్వారా ఒక ఖాతా నుండీ మరొక ఖాతాకి డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తునట్లయితే లావాదెవీకి ముందు తర్వాత బ్యాలెన్స్ వివరాలను తనిఖీ చేసుకోండి. మీవద్ద ప్రింటర్ ఉంటే స్టేట్‌మెంట్‌లను తరచూ ప్రింట్ చేసి పెట్టుకోవడం ఉత్తమం. సెల్‌ఫోన్, ప్రీపెయిడ్‌లని కొనడం, రైల్వే టికెట్లు, కరెంట్ బిల్లులు, మున్సిపాలిటీ అస్తి పన్నులు వంటివి ప్రస్తుతం ఆన్‌లైన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చెల్లించడానికి వీలు కలుగుతుంది. ఈ నేపధ్యంలో బిల్లులు చెల్లించడానికి ముందు మీ ఎకౌంట్‌లో ఎంత నగదు నిల్వ ఉందో చూసుకుని బిల్ చెల్లింపు పూర్తయిన తర్వాత ఎంత మొత్తం కట్ అయిందో బేరీజు వేసుకోండి. ఆ చెల్లింపులకు చెందిన లావాదేవీలు ప్రింట్ తీసిపెట్టుకోవడం మరువకండి. .తర్వాత ఏవైనా తేడాలు వస్తే ఆ ప్రింటౌటే మీకు రక్షణగా నిలుస్తుంది. క్రెడిట్‌కార్డ్ ఉంది కదా అని ఏ వెబ్‌సైట్‌కి పడితే ఆ వెబ్‌సైట్‌కి Premium Membership కోసం చెల్లింపులు జరపకండి. ఖచ్చితంగా నమ్మదగిన వెబ్‌సైట్లకి మాత్రమే చెల్లింపులు జరపండి. ఆన్‌లైన్ షాపింగ్ ప్రస్తుతం క్రేజ్ అయిపోయింది. కానీ, మీకు అందుబాటులో ఉన్న వస్తువుల్ని నేరుగా వెళ్ళి మన్నిక చూసుకుని కొనడమే మంచిది. మన దేశంలో దొరకని తప్పనిసరి వస్తువులను నెట్ ద్వారా ఆర్డర్ చేసుకోవడం తప్పదనుకోండి.

No comments:
Post a Comment