HTML

HTML2

Wednesday, March 23, 2011



ఎంత భారీ కాన్ఫిగరేషన్ కలిగిన కంప్యూటర్ అయినా భారీ మొత్తంలో డివైజ్ డ్రైవర్లు ఇన్‌స్టాల్ చేయబడి ఉన్నాయంటే బూట్ అవడం చాలా ఆలస్యమవుతుంది. విండోస్ బూటింగ్ సమయంలో మనం కంప్యూటర్లో ఇన్‌స్టాల్ చేసిన అన్ని డివైజ్ డ్రైవర్లూ మెమరీలోకి లోడ్ చేయబడుతుంటాయి. ఈ నేపధ్యంలో మీ వద్ద రెగ్యులర్‌గా ఉపయోగించే డివైజ్ డ్రైవర్లని మాత్రమే సిస్టమ్‌లో ఉంచుకుని ఎప్పుడో సంవత్సరానికి ఒకటి రెండు సార్లు మాత్రమే ఉపయోగించే డివైజ్ యొక్క డ్రైవర్లని తొలగించడం ఉత్తమం. డీఫాల్ట్‌గా విండోస్‌లోని Device Manager ప్రస్తుతం మన కంప్యుటర్‌కి కనెక్ట్ చేయబడని డివైజ్ డ్రైవర్ల వివరాలు చూపించదు. అవి కూడా Device Manager లో చూపించబడాలంటే Start>Run కమాండ్ బాక్స్‌లోకి వెళ్ళి cmd అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ వద్దకు వెళ్ళండి. ఇప్పుడు ఈ క్రింది కమాండ్ ఇవ్వండి. devmgr_show_nonpresent_devices=1 అని ఇచ్చి Enter కీ ప్రెస్ చేయండి. ఇప్పుడు My Computer పై మౌస్‌తో రైట్ క్లిక్ చేసి Properties>Device Manager అనే విభాగంలోకి వెళ్ళి View>Show Hidden Devices అనే ఆప్షన్‌ని క్లిక్ చెస్తే హిడెన్ డివైజ్‌లు చూపించబడతాయి

No comments:

Post a Comment