HTML

HTML2

Friday, October 18, 2013

5 రూపాయల కూలీ నుంచి .. అందనంత ఎత్తుకు ఎదిగి ..

తన కలలవైపు నమ్మకంతో ఎవరు అడుగువేస్తారో, తను ఊహించుకున్న జీవితాన్ని జీవించడానికి ఎవరు ప్రయత్నిస్తారో, వారు మామూలు సమయంలో ఆశించని విజయాన్ని సాధిస్తారు

మీకు యండమూరి వీరేంఇంతకీ ఆయన గురించి టాపికెందుకనుకుంటూన్నారా ?
ఎందుకంటే ..
ఆయన విజయం సాధించిన వ్యక్తి.
బాల్యంలో క్షవరం చేయించుకోవడానికి కుడా డబ్బుల్లేకపోతే కత్తెర పట్టుకుని స్వంతంగా క్షవరం చేసుకున్న వ్యక్తి.
చదువుకోడానికి పాఠ్యపుస్తకాలు కొనలేని పరిస్థితుల్లో స్వంత దస్తూరితో తన తండ్రి పాఠ్యపుస్తకాల్ని తయారు చేసి ఇస్తే వీధి బల్బుల క్రింద కూర్చుని చదువుకున్న వ్యక్తి. ఇదంతా గతంఇప్పుడాయన మిలినీయర్.
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఖరీదైన మనుషులు నివసించే బంజారాహిల్స్ లో స్థిర నివాసం ఏర్పరుచుకున్న ఒక విజేత .
అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది యండమూరి గురించి కాదు.
అమెరికాలో నివసిస్తున్న జ్యొతిరెడ్డి గురించి.
యండమూరికి, జ్యొతిరెడ్డికి మధ్య లింకేంటి…??
ఉంది.
* * * * * *
మీరు చాలెంజ్ సినిమా చూసారా? చిరంజీవి నటించాడు. సూపర్ డుపర్ హిట్. అందులో హీరోయిన్ తండ్రి రావుగోపాల్ రావు చిరంజీవితొ ఒక పందెం కాస్తాడు.
సరిగ్గా 2 సంవత్సరాల్లో చట్టపరంగా 50 లక్షలు సంపాదిస్తే , తన కూతురుని (విజయశాంతి) ఇచ్చి పెళ్లి చేస్తానని ” ,
చిరంజీవి చాలెంజ్ స్వీకరిస్తాడు.
అనుకున్నట్టే 50 లక్షలు సంపాదిస్తాడు. కానీ ఇది సినిమా.
నిజం కాదు. అందుకే అది నిజ జీవితం లో సాధ్యం కాకపోవచ్చని చాలా మంది అనుకోవచ్చు .
సినిమా కథను కూడా యండమూరె రాసారు. అయితే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం .
ఇప్పుడు మీకొక నిజాన్ని చెప్పబోతున్నాను .
* * * * * *
మీకు జ్యొతిరెడ్డి గురించి తెలుసా…!
అమెరికాలో సాఫ్టవేర్ కంపెనీకి సిఈఓ.
కంపెనీ ఇప్పుడు కోట్లాది రూపాయల టర్నోవర్ చేస్తోంది .
ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగాలాల్లో జ్యోతి రెడ్డి గారి జీవనం .
5 రూపాయల దినసరి వ్యవసాయ కూలి నుంచి
ఇప్పుడు అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు .
ఇది సినిమా కాదు.
నిజం. అవునో నిజమే
ఊపిరి బిగపట్టి చదవండి.
* * * * * *
నర్సింహులు గూడెం.
ఇది జ్యొతిరెడ్డి ఊరు. వరంగల్ జిల్లాలో ఉంది .
మధ్య తరగతి కుటుంభం,దీనికి తోడు ఎమర్జెన్సీ టైం లో తండ్రి ఉద్యోగం పోయింది .
ఐదుగురు తోబుట్టువుల్లో జ్యొతిరెడ్డి ఒకరు. కుటుంభ పోషణ తండ్రికి కష్టమైంది.
అప్పుడు ఆయన ఏమి చేసాడో తెలుసా ..?
`తల్లిలేని పిల్ల
అని అబద్దం చెప్పి జ్యోతిని హన్మకొండలోని బాలసదనంలో చేర్పించాడు .
తల్లిదండ్రులు లేని వారికే అందులో ఎంట్రన్స్.
ఇదీ జ్యోతి రెడ్డి బాల్యం .
రోజులు గడుస్తున్నాయి.
తల్లిఉన్నా అనాదలా బ్రతకడం ఆమెను భాదించింది , ఎంతో కుమిలి కుమిలి ఏడ్చేది .కానీ తప్పని పరిస్థితి . ఏమీ చేయలేని నిస్సహాయత . అప్పుడే బలంగా నిర్ణయించుకుంది . తన జీవితం లో మార్పులు సంభవించాలంటే .. తనకు చదువు తప్ప మరో ఆప్షన్ లేదని .
కస్టపడి, ఇష్టపడి . రాత్రుళ్ళు , తెల్లవార్లూ
చదువు..చదువు ..చదువు .
ఫలితం
టెన్త్ లో ఫస్ట్ క్లాస్. సెలవుల్లో టైపింగ్ నేర్చుకుంది . టీచర్ కావాలని ఒకేషనల్ కోర్స్ చేసింది. కాని కోర్సు పూర్తాయ్యక తెలుసుకుంది . అది టీచర్ ఉద్యోగానికి అర్హత కాదని.
* * * * * *
18 ఏళ్ల వయస్సు ,
చదువుకుంటానని బ్రతిమిలాడినా ఇంట్లో వినలేదు. పెళ్లి చేసారు.
ఇద్దరు పిల్లలు.
కుటుంభం గడవాలంటే పనిచేయాలి .
వ్యవసాయ కూలిగా జీవితం ప్రారంభమైంది. రోజుకు 5 రూపాయలు ఇచ్చేవారు .
పిల్లల్ని ఇంట్లోనే వదిలిపెట్టి కూలిపనికి వెళ్ళేది.పొలాల్లొ నాట్లు వేసేది .కలుపు తీసేది .
కానీ ఆర్ధిక సమస్యలు వేదిస్తూనే ఉండేవి .
జీవితమంతా దుర్బరంగా అనిపించేది.కల్లల్లొ నీళ్ళు సుడులు తిరిగేవి .
మార్పు కోసం మనసు తాపత్రయ పడేది
కొంత మెరుగైన జీవితం కావాలి అని అనిపించేది .
ఎలా? ఎలా?
* * * * * *
మనిషి అట్టడుగు పొరల్లో నిద్రాణమై ఉన్న శక్తులు ఉన్నాయి . అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తే శక్తులు, తనకున్నట్టే ఎన్నడూ కలనైన తెలియని శక్తులు, వాటిని గనుక మేలుగోలిపి ,ఆచరణలో పెడితే అతని జీవితాన్నే అనూహ్యంగా మార్చివేసే ఆయుధాలు
కూలి పొజిషన్ నుంచి కొంచెం మార్పు మొదలైంది . నేషనల్ సర్వీస్ వాలేన్టిర్ గా మరో ప్రయాణం మొదలైంది . తర్వాత నెహ్రూ యువ కేంద్రంలో జ్యోతికి మరో చిన్న అవకాశం వచ్చింది .
కాని రిస్కుతో కూడుకున్న జాబు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో తిరగాలి.
అప్పడు ఆమె `రిస్క్కు సిద్దపడింది.
ఇంట్లోని చిన్న ఇనుప పెట్టెలో అన్నీ సర్దుకుని ఇద్దరు పిల్లలతో వరంగల్ నగరంకు బయలుదేరింది .
* * * * * *
చిన్న ఉద్యోగం అయితే ఉంది .కాని బ్రతకడానికి అదొక్కటే సరిపోవడం లేదు . టైపింగ్ క్లాసులకు వెళ్ళింది .
టైలరింగు నేర్చుకుంది . లంగాలు కుట్టి దుకాణాల్లో ఇచ్చేది. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే చదువే ముఖ్యమని నమ్మింది. ఓపెన్ యూనివర్సిటీ ద్వార డిగ్రీ పట్టా పుచ్చుకుంది.
టైపింగ్ కూడా పాసైంది.
స్పెషల్ టీచర్ గా ఉద్యోగం. హమ్మయ్య కొంచెం స్థిరత్వం .
18 నెలల తర్వాత రెగ్యులరైజ్ , పరకాల ప్రక్కన రామక్రిశ్నాపూర్లొ ఉద్యోగం.
జీవితం సాదాసీదాగానే గడిచిపోతోంది . ఇబ్బందయితే ఏమీ లేదు .
కానీ ఎక్కడో .. ఎందుకో ..కొంచెమ్ నిర్లిప్తత.
ఇంకా ఏదో చేయాలి .. ఏదో సా ..దించాలి .
అప్పుడామే ఒక గోల్ పెట్టుకుంది .
సాదా సీదా గోల్ కాదు .
`అందనంత ఎత్తుకు ఎగరాలనేగోల్ .
అమెరికా లో సెటిలవ్వాలని.. అవును ..
అమెరికా లో సెటిలవ్వాలని……..
అమెరికా లో సెటిలవ్వాలని.. ”
* * * * * *
మనం ఉన్నతంగా జీవించాలంటే మన లక్ష్యాలు పెద్దదివిగా ఉండాలి
అలాంటి లక్ష్యమే పెట్టుకుంది జ్యోతి .
5 రూపాయలకు కూలిగా పనిచేసిన మహిళ
అమెరికా లో సెటిలవ్వాలని కలలు కనడం ఊహించదగినదేనా ??
జ్యోతి మాత్రం మెంటల్ గా దానికే ప్రిపేర్ అయిపొయింది .
.
.
.
తరువాతెమైంది ??
* * * * * *
2000 మే 2 బేగంపేట విమానాశ్రం.
విమానాశ్రయం చూడడం అదే మొదటిసారి , అంతా కొత్త కొత్తగా ఉంది .
హైదరాబాద్ నుంచి బయలుదేరి అమెరికాలో అడుగుపెట్టింది .
అడుగు పెట్టిందే కానీఅసలు కథ అప్పుడే మొదలైంది.
మళ్ళీ చాలా కాలం తర్వత స్త్రగుల్స్ మొదలయ్యాయి.
కారణం ..
తను వచ్చింది హెచ్1 విసా కాకపోవడంతో అమెరికా లో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు.
హెచ్ 1 విసా రావాలంటే ఇంగ్లిష్ పై పట్టు ఉండాలి .
కానీ తనకు అదీ మైనస్ పాయింట్ . ఇంగ్లిష్ అంత ఎక్కువగా కమాండింగ్ లేదు .
దేశం కాని దేశం లో .. విధి లేని పరిస్థితుల్లో
అవమానాలు, ఆర్ధిక ఇబ్బందుల మధ్య ..
ఒక మూవీ క్యాసెట్ షాపులో సేల్స్ గర్ల్ గా జాయిన్ ఐంది .
మల్లి కష్టాలే. చిన్న షాపులో పనిచేస్తే వచ్చే డబ్బులు సరిపోవడం లేదు.
కథ మళ్ళీ మొదటికోస్తోంది .
అప్పుడు ఆమె ఒక బలమైన నిర్ణయం తీసుకుంది .
తన కెరీర్ కు అడ్డుపడుతున్న ఇంగ్లీష్ పని పట్టింది . ఫలితం ఇప్పుడు ఇంగ్లిష్ తో `ఆడు కుంటోంది
ఆటలో అంతులేని ఆత్మా విశ్వాసం కనిపిస్తోంది .
తన కలల హెచ్1 విసా తన స్వంతమైంది .
హెచ్1 విసా తన స్వంతమైంది .
హెచ్1 విసా తన స్వంతమైంది .
వర్జియాలో మంచి ఉద్యోగం వరించింది .
అంతలోనే ఇంకో స్టెప్ ..
ఈసారి బిగ్ స్టెప్
మెగా లివింగ్ కావాలంటే బిగ్ స్టెప్ తప్పదు .
అమెరికా లో అడుగుపెట్టిన 17 నెలల్లో,
అంటే అక్టోబర్ 2001 లో స్వంత కంపెనీ స్టార్ట్ చేసింది.
కంపెనీ పేరు కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్
ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ . మెరుగైన జీవనం .
ఇద్దరు కుతుల్లకి పెళ్లి చేసి చేసింది . ఇప్పుడు అమ్మమ్మగా కొత్త పాత్ర.
తను పుట్టి పెరిగిన దేశానికి తరచుగా వస్తూనే ఉంటుంది .
హై క్లాసు క్యాడర్ తో సంభందాలు ..
మహిళలకు , వృద్దాశ్రమాలకూ , తన వంతు సహాయం చేస్తోంది .
గెలిచిన విజేతకు మీడియా సహకరిస్తోంది .
అందనంత ఎత్తుకు ఎదిగినా ఎక్కడా చాయలు కనబడవు ,
ఓర్పు నేర్పు గర్వం లేకపోవడం .. ఆమె ఆభరణాలు .
న్యూస్ టీవీ ఇంటర్వ్యూ కావాలని అడిగినప్పుడు వెంటనే సిద్దమైపోయింది .
ఒక తెలుగింటి ఆడ పడుచులా అన్ని అనుభూతులూ పంచుకుంది .
జ్యోతి రెడ్డి సక్సెస్ స్టొరీ మరింత మందికి స్పూర్తి కావాలి.
ఆమె సేవలు మరింత ఎక్కువ మందికి అందాలి .


No comments:

Post a Comment