HTML

HTML2

Sunday, February 15, 2015

బేటి బచావో బేటి పడావో ప్రచారంలో భాగంగా ‘సుకన్య సమ్రిద్ధి యోజన’ను ప్రారంభించిన ప్రధాని మోదీ

Who: ప్రధాని మోదీ
Where: న్యూఢిల్లీ, పానిపట్, హర్యానా
What: ‘సుకన్య సమ్రిద్ధి యోజన' ప్రారంభం
When: 22 జనవరి 2015
Why: బేటి బచావో బేటి పడావో ప్రచారంలో భాగంగా
BBBP campaignభారత ప్రధాని నరేంద్ర మోదీ, 22 జనవరి 2015న బేటి బచావో బేటి పడావో (BBBP) ప్రచారంలో భాగంగా బాలికల కోసం ‘సుకన్య సమ్రిద్ధి యోజన’ అనే చిన్న జమ పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా కుటుంబంలోని ఆడ బిడ్డ ఎలాంటి వివక్షకు గురి కాకుండా, మగబిడ్డతో సమానంగా ఆర్ధిక స్వేచ్ఛను మరియు పొదుపు అవకాశాలను పొందవచ్చు. ‘సుకన్య సమ్రిద్ధి యోజన’ పథకం ద్వారా 10 ఏళ్ల వయస్సు లోపు ఆడపిల్లల యొక్క తల్లిదండ్రులు, బాలిక పేరిట బ్యాంకు ఖాతాలను తెరవవచ్చు.

సుకన్య సమ్రిద్ధి ఖాతా గురించి
• సుకన్య సమ్రిద్ధి ఖాతా, 9.1 శాతం వడ్డీ రేటును మరియు ఆదాయ పన్ను రిబేటును అందిస్తుంది.
• సుకన్య సమ్రిద్ధి ఖాతాను బాలిక యొక్క జననం నుండి బాలికకు 10 సంవత్సరాల (పదేళ్ళ) వయస్సు వచ్చే వరకు 1000 రూపాయల కనీస జమతో ఎప్పుడైనా తెరవవచ్చు.
• ఒక ఆర్ధిక సంవత్సరంలో గరిష్టంగా 1.5 లక్ష రూపాయలను కూడా జమ చేయవచ్చు. ఈ ఖాతాను ఏదేని పోస్ట్ ఆఫీసులో గానీ వాణిజ్య బ్యాంకుల శాఖలో గానీ తెరవవచ్చు.
• ఈ ఖాతా ప్రారంభించిన నాటి నుండి 21 ఏళ్ల వరకు ఆపరేషన్ (ఆచరణ)లో ఉంటుంది. అలాగే బాలికకు పెళ్లి వయస్సు అయిన 18 ఏళ్ల వరకు కూడా ఖాతాను నడుపుకోవచ్చు.
• బాలికకు 18 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత, పై చదువుల అవసరాల కోసం ఖాతాలోని మొత్తంలో సగాన్ని తీసుకోవచ్చు.

1 comment: