మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌లో 3G లో కానీ లేదా 2G లో కానీ పరిమిత డాటా ఆఫర్‌ను ఉపయోగిస్తున్నారా? నిరంతరం మీ మొబైల్‌లో డాటా ఆన్ చేసి ఉంచితే మీకు తెలియకుండానే, కొంత డాటా మీరు ఉపయోగించకుండానే మీ ఫోన్ ద్వారా ఉపయోగించబడుతుంది. అలా డాటా వృధా కాకుండా ఉండాలంటే సెటింగ్స్‌లోకి వెళ్లి ప్రతీసారీ ఇంటర్‌నెట్ ను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవల్సి ఉంటుంది.
అంత కష్టపడకుండా హోంమ్ స్ర్కీన్‌పై ఒక షార్ట్‌కట్ ఉండి, దాన్ని టచ్ చేసిన వెంటనే డాటా ఆన్/ఆఫ్ కావడానికి అవకాశం కల్పంచేదే ఈ DATA ON-OFF Widget. మీరు దీన్ని గూగుల్ ప్లేస్టోర్‌లో వెతికి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్ చేసుకుని, అందులోని సూచనలకు అనుగుణంగా, ఈ widget ను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోగానే, మీ ఫోన్‌పై up and down arrow marks తో ఒక సింబల్ కన్పిస్తుంది.
ఇక నుంచి ఇంటర్‌నెట్ ఆన్ చేసుకోవాలంటే జస్ట్ ఆ బటన్‌ను టచ్ చేస్తే సరిపోతుంది.
ఇంటర్‌నెట్ ఉపయోగించుకున్న అనంతరం అదే ఐకాన్‌ను టచ్ చేస్తే ఇంటర్‌నెట్ ఆఫ్ అవుతుంది. మీ బ్యాండ్‌విడ్త్ కలిసొస్తుంది.
No comments:
Post a Comment