ఒక చీమ రోజు ఆఫీసు కి వెళ్తుండేది . ఆడుతూ పాడుతూ పని చేసిది . అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది . సీఈఓ సింహం రోజూ చీమని చూసి gసంతోసించేవాడు . ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు . చీమ దానంతటది పని చేస్తేనే ఇంత బాగా చేస్తోంది , దీని పైన ఒక సూపర్ వైజర్ ని పెడితే ఇంక ఎంత బాగా చేస్తుందో అని . ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్ వైజర్ గ నియమించాడు . బొద్దింక అప్పటిదాకా లేని నివేదికలు,అటెండేన్స్ లు ప్రవేశ పెట్టింది . వీటన్నిటిని చుసుకోవడానికి ఒక సాలీడు ని సెక్రటరీ గ నియమించుకుంది . సింహం గారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వాళ్ళ ఎంత ఉత్పత్తి పెరిగింది , పని విదానానికి సంబందించిన రిపోర్ట్ లు వగైరా అడిగారు . ఇవన్ని చేయడానికి బొద్దింక ఒక కంప్యూటర్ ని ఒక ప్రింటర్ ని తెప్పించుకొని వాటిని ఆపరేట్ చేయడానికి ఒక ఈగని నియమించింది . మరో వైపు ఆడుతూ పాడుతూ పని చేసే చీమ నీరసించడం మొదలు పెట్టింది . అది చేసే పని కి తోడూ పై అదికారులతో మీటింగ్ లు , ఎప్పటికప్పుడు అంద చేయాలసిన రిపోర్ట్ లు దాని నెత్తి మీదకొచ్చి పడ్డాయి . ఈ లోగ బొద్దింక అధికారికి తోడూ మరో మేనేజర్ ,వీళ్ళ హోదా కి తగినట్లు ఆఫీసు కు కొత్త హంగులు ,ఆర్భాటాలు మొదలైనాయి . క్రమంగా చీమ కే కాదు ఆఫీసు లో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండా పోయింది . ఉత్పత్తి పడిపోయింది . సిఈఓ సింహం గారు ఈ సమస్యని పరిష్కరించే పనిని కన్సల్టెంట్ గుడ్ల గూబ కి అప్పగించారు . ఇలాంటి సమస్యలకు పరిష్కారం కనుక్కోవడం లో ప్రపంచ ప్రసిద్ది గాంచిన గుడ్లగూబ గారు ఆఫీసు స్తితిగతులని అద్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తేల్చి చెప్పారు . వెంటనే సింహం ,బొద్దింక మీటింగ్ పెట్టుకొని చాలా కాలంగా అలసత్వం ప్రదర్శిస్తున్న చీమని పనిలో నుండి తొలగించాలని తీర్మానించాయి .
-ఇదొక ఈజిప్ట్ కథ ..
true
ReplyDelete