HTML

HTML2

Saturday, February 22, 2014

GDS MAHADEVAIAH GROUP STRIKE INFORMATION

STEPS HAVE BEEN STARTED TO BREAK 150 YEARS SLAVERY.

ONCE AGAIN PROVED THAT ONLY STRUGGLES CAN SETTLE THE JUSTIFIED DEMANDS.

 GDS UNITY GOT THIS VICTORY. HATS OFF TO ALL.

THE OUTCOME OF INDEFINITE STRIKE IS RESPECTABLE AGREEMENT. 

OUR LEADERS MET HON’BLE DOPT MINISTER SRI. V.NARAYANA SWAMY AT HIS RESIDENCE 29 TUGLAK CRESCENT ON 21/2/14 AT 7:30 P.M. AND SUBMITTED DETAILED MEMORANDUM AND EXPLAINED GDS PROBLEMS. HON’BLE MINISTER ASSURED OUR LEADERS THE ISSUES PERTAINING INCLUSION OF GDS IN 7TH CPC AND 50% DA MERGER WILL BE DISCUSSED WITH DOPT OFFICERS ON MONDAY.

CHQ CONGRATULATES ALL CWC MEMBERS, CIRCLE SECRETARIES DIVISIONAL/BRANCHA SECRETARIES, OUR MEMBERS, WELL WISHERS AND SISTER UNIONS LEDERS AND MEMBERS AND POLITICAL  LEADERS FOR THEIR CONTRIBUTION FOR MAKING INDEFINITE SUCCESS

A DETAILED REPORT WILL BE POSTED TOMORROW  



AGREEMENT COPY

150 సంవత్సరాల భానిసత్వం ఛేదించేదిశగా అడుగులు ప్రారంభం 
పోరాటాలు మాత్రమే  న్యాయమైన డిమాండ్లను పరిష్కరింపగలవని మరొకసారి ఋజువైన వైనం
GDS ల ఐక్యతే ఈ విజయానికి సంకేతం
 అందరికి రెడ్ సెల్యూట్
 నిరవధిక సమ్మె ఫలితం గౌరవప్రదమైన ఒప్పందం 
             ది. 21-02-2014 సాయంత్రం 7.30 గం. లకు మన నాయకులు గౌరవనీయులైన DOPT మంత్రివర్యులు శ్రీV.నారాయణస్వామిగారిని, ఆయన నివాసం 28 తుగ్లక్ క్రీసేంట్ నందు కలసి సవివరమైన మెమొరాండం అందజేసి GDS సమస్యలు వివరించారు. గౌరవనీయులైన మంత్రిగారు GDS ఉద్యోగులను 7వ వేతన సంఘంలో చేర్చుకునే విషయం మరియు 50 % DA విలీనం సోమవారం DOPT  అధికారులతో చేర్చించగలనని హామీ ఇచ్చారు. 

       ఒప్పందం పూర్తి పాఠం తెలుగులో ఈ క్రింద ఇస్తున్నాం:

                                                             భారత ప్రభుత్వం 
                                         కమ్యునికేషన్లు మరియు I.T. మంత్రిత్వశాఖ 
                                                          పోస్టల్ డిపార్టుమెంటు 
డాక్ భవన్ ,
పార్లమెంట్ వీధి 
న్యూ ఢిల్లీ - 110001
No. 08/21/2013-SR    తేది :ది.21-02-2014

        విషయం : ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ 18-02-2014 నుండి చేపట్టిన సమ్మె   
                       వివరణ  గురించి. 

          ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ మరియు ఇతర ప్రతినిధులతో జరిగిన సమావేశమునకు మెంబర్ (P), D.D.G (SR&లీగల్) మరియు డైరెక్టర్ (SR&లీగల్) హాజరైనారు. 
          సుహృధ్బావ వాతావరణంలో జరిగిన సమావేశంలో ఈ క్రింది ఒప్పందం చేసుకున్న తరువాత సమ్మె వివమించుటకు స్టాఫ్ సైడ్ అంగీకరించినది. 
         " ప్రభుత్వం GDS వేతన సవరణ మరియు సర్వీసు కండీషన్స్ 7వ వేతన సంఘం పరిధిలోకి చేర్చుటకు అంగీకరించనట్లయితే తపాల శాఖ GDS వేతన సవరణ మరియు ఇతర  సర్వీసు కండీషన్స్ పరిశీలించుటకు రిటైర్డ్ హై కోర్ట్ జడ్జి లేదా రిటైర్డ్ సుప్రీం  కోర్ట్ జడ్జితో ఏక సభ్య సంఘాన్ని నియమిస్తుంది. "
            ఎజండాలోని ఇతర అంశములు ఇంతకు ముందే చర్చించబడినవి. ఆ మినిట్స్ కాపీ అందజేయటం జరిగినది. 

సం/                                                                                                    సం/
కమలేష్ చంద్ర                                                                        SS మహాదేవయ్య 
మెంబెర్(P)                                                                                 జనరల్ సెక్రటరీ 21-02-2014                                                                                    AIGDSU        
                                                                                                     21-02-2014 

                                                                   ---------------
నిరవధిక సమ్మె విజయవంతం కావడానికి సహకరించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, డివిజన్/ బ్రాంచి  కార్యదర్శులకు, మన సభ్యులకు, P3, P4 యూనియన్ లోని GDS శ్రేయోభిలాషులకు, NUGDS నాయకులకు, సభ్యులకు, ఇక్యవేదిక నాయకులకు, సభ్యలకు రాష్ట్ర సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తున్నాం. 
                                                                    ---------------
BVRao
AGS & CS  

No comments:

Post a Comment