ఆన్లైన్ లో ఆధార్ కార్డు ని మీ Gas ఎకౌంటు కి లింక్ చేయండిలా
మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా చేసుకోండి , ఆన్లైన్ లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్ చేసుకోవచ్చు , లేదంటే ఆన్లైన్ లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి . కేవలం సులబమయిన 4 steps follow అయి చేసుకోండి , మీ ఫ్రెండ్స్ / బందువులకి కూడా చేసిపెట్టండి .
ఇలా చేయండి :
ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .
https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx
Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి
Step 2: Choose Benefit Type లో ...
Benefit Type - (LPG)
Scheme Name - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి
Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి
Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి
Step 3: Enter your details...
దగ్గర Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమి కాదు ) , Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి
మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయం లో ఇవ్వబడిన మొబైల్ కు OTP నంబర్ మెసేజ్ పంపబడుతుంది ,
Step 4: Confirm Request
మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని మరియు Enter the text shown దగ్గర text ని ఎంటర్ చేయండి .
Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది .
మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబందించిన Authority మీ వివరాలు check చేసి మీకు తెలియబరుస్తారు .
తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చు.
No comments:
Post a Comment