HTML

HTML2

Friday, January 10, 2014

లైంగిక వేధింపుల నిరోధక చట్టం - 2013

 

దేశవ్యాప్తంగా జరుగుతున్న దాడులను చూస్తుంటే మహిళలకు ఎక్కడా రక్షణ లేదన్న విషయం స్పష్టమవుతుంది. ఇంట్లో హింస ను నివారించడానికి చట్టాలు తీసుకువచ్చిన ప్రభుత్వం పనిప్ర దేశాల్లో హింసను నివారించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందిం చింది. పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపులు అరికట్టడానికి లైంగి క వేధిం పుల నిరోధక చట్టం - 2013 రూపొందిం చబడింది.

                                 ఈ చట్టం 3సెప్టెంబర్‌ , 2012న లోక్‌సభ లో, 26 ఫిబ్రవరి, 2013 లో రాజ్యసభలో ఆమోదించ బడింది. 9డిసెంబర్‌, 2013 నుంచి అమలులోకి వచ్చింది. ఈ చట్టం లో ముఖ్యంగా మహిళలు పనిచే స్తున్న ప్రదేశాల్లో యాజమానుల నుంచి గాని, తోటి మగ ఉద్యోగుల వల్ల గాని మానసిక, శారీరక హింసకు గురి కాకుండా రక్షించ టానికి ఈ చట్టంతీసుకు రావటం జరిగింది. పని ప్రదేశా ల్లో హింస నుంచి రక్షణ కల్పించేందుకు, లింగవివక్ష లేకుండా, గౌరవంగా తమ విధులు నిర్వహించడానికి అనువైన పరిస్థితుల ను కల్పించడమే ఈ చట్టం ముఖ్య లక్ష్యం.

మన రాజ్యంగంలో పొందుపరచిన ఆర్టికల్‌ 14,15, 21లను రక్షించడం. మహిళలు పని చేసే స్థలంలో వారు శారీరకంగా, మానసికంగా ఎటువంటి హింసలకు గురికాకుండా ఈ చట్టం రక్షణనిస్తుంది.

ఎలాంటి సందర్భాల్లో ఈ చట్టాన్ని ఉపయోగించవచ్చు...

పని ప్రదేశాల్లో యజమాని, పై అధికారులు, తోటి ఉద్యోగులు ఎవరైనా.. మాటల ద్వారా గాని, సంజ్ఞల ద్వారా గాని, మెసెజ్‌ల ద్వారా గాని హింసించినా వారిపై కేసు నమోదు చేయవచ్చు.
వివక్ష చూపించినా.. . అకారణంగా వేధించినా కేసు ఫైల్‌ చేయ వచ్చు.

పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం సూచించే చర్యలు...
 
ఈ చట్టం ప్రకారం ప్రతిసంస్థలో మహిళా కమిటీలను యాజమాన్యం ఏర్పాటు చేయాలి. ఫిర్యాదు చేసిన వారిని బెదిరించకూడదు. ఉద్యోగ రక్షణ ఉండాలి. ఫిర్యాదు వచ్చిన 60 రోజుల నుంచి 90 రోజులలోపు విచారణ జరిపించవలసి ఉంటుంది. ఈ చట్టం గురించి అవగాహన కల్పించవలసిన బాధ్యత యాజమాని, పై అధికారులపైనే ఉంటుంది. పని చేసిన చోట వీధించినా, అసభ్యంగా మాట్లాడినా బాధితురాలు ఫిర్యాదు చేసిన వెంటనే నిందితులను శిక్షించే విధంగా మార్పులు చేశారు.ఒకవేళ బాధితురాలు తరపున తల్లిదండ్రులు ఫిర్యాదు చేయ వచ్చు.

ఈవ్‌ టీజింగ్‌కి పాల్పడిన వారిపై ఐ. పి.సి సెక్షన్‌ 509 ప్రకారం కేస్‌ పెట్టి అరెస్ట్‌ చేస్తారు.
అత్యచారానికి ప్రయత్నించిన వారిపై ఈ చట్టంతో పాటు నిర్బయ చట్టం ద్వారా కేసు పెట్టే వీలుంది.
పని చేస్తున్న స్థలంలో మహిళల కు అసభ్యమైన మెసెజ్‌లు పంపించటం, చిత్రాలు చూపించడం, ఫొటోలను మార్ఫీంగ్‌ చేయడం వంటి అసభ్యకరమైన చర్యలకు పాల్పడితే ఈ చట్టంతో పాటు సెక్షన్‌ 65ఎ, 67 ప్రకారం కేస్‌ ఫైల్‌ చేస్తే మూడు సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు వరకు శిక్ష పడుతుంది.

రద్దీ ప్రాంతాలు, బస్సులు, రైళ్ళు ఇతర ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా అవమానించటం, మర్యాదకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే నిందితులపై ఐ.పి.సి సెక్షన్‌ 354 ప్రకారం కేస్‌ నమోదు చేసి శిక్ష వేయవచ్చు.

పని చేసే ప్రాంతంలో యాజమాని నుంచి వేధింపులు ఉంటే శిక్షతో పాటు 50వేల రూపాయల జరిమాన ఉంటుంది. మళ్ళీ అదే తప్పు చేస్తే శిక్షాకాలం పెరుగుతుంది. సహ ఉద్యోగుల నుంచి వేధింపులు ఉన్నట్లయితే కేసు వేయవచ్చు. మళ్లిd అదే రీపిట్‌ అయితే ఐ.పి.సి సెక్షన్‌ ప్రకారం మూడు సంవత్సరాల జైలు శిక్ష, జరినామా ఉంటుంది.

ఎన్ని చట్టాలు చేసినప్పుటికి వాటి గురించి సరైన ప్రచారం లేకపోవటం వల్ల మహిళలలో అవగహన లేకపొవటం వలన ఈ చట్టాలు నిరూపయోగం అవుతున్నాయి. అన్యాయం, మానసిక, శారీరక హింసలు జరిగినప్పుడు పోలీస్‌ల సేష్టన్‌కి వెళ్ళి ఫిర్యాదు చేసేలా ధైర్యం, దోషులకు శిక్ష పడుతుందన్న భరోసా మహిళలకు కల్పించగలిగినప్పుడే. . చట్టాలను అమలు చేయగలం. లేకపోతే ఎన్ని చట్టాలు చేసినా అని నిరుపయోగంగా మిగిలిపొతాయి!

No comments:

Post a Comment