ఒక ప్రణాళిక - జీవితాన్నే మార్చేస్తుంది
ప్రణాళిక ఉన్నవారికీ లేనివారికీ ఒకటే తేడా .ప్రణాళిక ఉంటె మనం చుడాలానుకున్నది చూస్తాం .ఆలోచిన్చాలనుకున్నదే ఆలోచిస్తాం .ప్రణాళిక లేకపోతే ,ఏది కనిపిస్తే అదే చూస్తాం .ఏది తోస్తే అదే ఆలోచిస్తాం .
పరిపూర్ణ జీవితానికి పక్కా ప్రణాళిక ఉండాల్సిందే !
'ఆలస్యమెందుకు? లక్ష్యానికి గురిపెట్టు?'
'లక్ష్యమా! అదెక్కడుంది?'
ఓ పదేళ్ల వ్యవధిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వందమంది విద్యార్థుల
మీద ఓ అధ్యయనం చేశారు. అందులో ఎనభైమూడు మందికి అసలు లక్ష్యాలే లేవు. పద్నాలుగు
మందికి లక్ష్యాలున్నాయి కానీ, ఎలా సాధించాలనే ప్రణాళికలేదు. ముగ్గురికి
మాత్రం...స్పష్టమైన లక్ష్యాలున్నాయి, అక్షరబద్ధమైన ప్రణాళికలున్నాయి. పదేళ్ల
తర్వాత చూస్తే...ఆ పద్నాలుగుమందీ మిగతా ఎనభైమూడుమందికంటే...పదిరెట్లు ఎక్కువ
సంపాదిస్తున్నారు. ఆ ముగ్గురూ పద్నాలుగుమంది కంటే వందరెట్లు ఉన్నతమైన
స్థానాల్లో ఉన్నారు.
మనిషి ఆలోచనా జీవి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు నిద్రలోనూ
వదిలిపెట్టవు. రోజూ మనకు అరవైవేల ఆలోచనలు వస్తుంటాయి. అందులో తొంభైశాతం
నెగెటివ్ ఆలోచనలే. చాలా సందర్భాల్లో, ఒకే ఆలోచన పదేపదే బుర్రను తొలిచేస్తూ
ఉంటుంది. ఒక్కటీ పనికొచ్చేది ఉండదు. మన మనసుకు ఓ పరిమితి ఉంది. ఒకసారి ఒక
విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఒక్క ఆలోచనా గాలివాటంగా వచ్చేదే
ఎందుక్కావాలి? మనం ఎంచుకున్నదే కావచ్చుగా! *మనం ఏం ఆలోచించాలన్నది మనమే
నిర్ణయించుకోవచ్చుగా. అదేం అసాధ్యం కాదు. సాధనతో సమకూరుతుంది. ప్రాణాయామంలో,
ధ్యానంలో జరిగేది అదే.*
నోబెల్ సాధించాలి, శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకోవాలి, ...ఇలా ఓ పట్టాన
నిద్రపోనివ్వని పాజిటివ్ ఆలోచనలకు స్పష్టమైన రూపం వస్తే, అదే లక్ష్యం. ఈ
దశలోనే 'ఎలా' అన్న ప్రశ్న తలెత్తేది. ఎదగాలనుకుంటాం. ఎలా ఎదగాలో తెలియదు.
సాధించాలనుకుంటాం. ఎలా సాధించాలో తేల్చుకోలేం. ఈ సమయంలో ఎటెళ్ళాలో తెలిపే
దిక్సూచి కావాలి. ఏ దారి మనల్ని గమ్యానికి చేరుస్తుందో తెలిపే రోడ్‌మ్యాప్
కావాలి. ఎంత సమయంలో ఎంతదూరం వెళ్ళలగలవో లెక్కగట్టడానికి కత్తిలాంటి
కాలిక్యులేటర్ కావాలి. ప్రతినిమిషం, ప్రతిగంటా గంటకొట్టి వెన్నుతట్టడానికి
గడియారం కావాలి. రోజులు గడిచిపోతున్నాయని చెవి మెలేసి మరీ గుర్తుచేయడానికి
క్యాలెండరు కావాలి. పరిపూర్ణమైన ప్రణాళికలో ఈ సాధన సంపత్తి అంతా ఉంటుంది.
*ప్రణాళిక రాసుకోడానికి ఖరీదైన నోటుబుక్కూ రంగురంగుల స్కెచ్ పెన్నులూ
అక్కర్లేదు. భాష అత్యద్భుతంగా లేకపోయినా ఫర్వాలేదు. కానీ రాతలో నిజాయతీ ఉండాలి.
ప్రతి అక్షరంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. మనం శక్తిమంతులం. *సృజనాత్మక
వ్యక్తులం. ఒక్కసారి గుర్తుచేసుకోండి. చిన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంటాం! ఎంత
గొప్పగా ఆలోచిస్తాం! ఆకాశంలో విమానం కనిపించగానే, 'పెద్దయ్యాక పైలెట్
అవుతానోచ్' అని ప్రకటించేస్తాం. 'నీ వెుహం! ఆ చదువు చదవాలంటే బోలెడంత డబ్బు
కావాలి' అంటూ ఆశల మీద దోసెడు నీళ్లు చల్లేస్తారు పెద్దవాళ్ళు. టీవీలో
కిరణ్‌బేడీని చూడగానే 'ఐపీఎస్ ఆఫీసర్ని అవుతా' అని పబ్లిక్ స్టేట్‌మెంట్
ఇచ్చేస్తాం. 'బక్కపీచు వెధవా, నీకు పోలీసు ఉద్యోగమెందుకు?'... నిర్దాక్షిణ్యంగా
కలల్ని కాలరాచేస్తారు చుట్టూ ఉన్న జనం. ఎదిగేకొద్దీ మన కలలు కురచైపోతాయి.
ఆత్మవిశ్వాసం చిక్కిశల్యమైపోతుంది. పట్టాచేతికొస్తే అదే పదివేలని
సర్దుకుపోతాం. గుమస్తా ఉద్యోగమైనా చాలనుకునే స్థితికి వచ్చేస్తాం. వ్యక్తిత్వ
వికాస నిపుణుడు రాబిన్‌శర్మ ఇలాంటి పరిమితుల్ని 'కనిపించని కంచెలు' అంటాడు.
ముందు ఆ మాయల ముళ్ళపొదల్ని పెకిలించి వేయండి. అవి మీ దరిదాపుల్లో కూడా
ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు మీ ప్రణాళికా రచనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు.
పసివాడిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచించారో అలానే ఆలోచించండి. మీలో అంతర్లీనంగా ఉన్న
సృజననంతా వెలికితీయండి. మoచి కలలు కనండి. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని
పోగుచేసుకోండి. గొప్పగొప్ప లక్ష్యాల్ని నిర్దేశించుకోండి. కంచెల్లేవ్.
కందకాల్లేవ్. సరిహద్దుల్లేవ్. శృంఖలాల్లేవ్. ఇప్పుడు, మీ జీవిత ప్రణాళికకు ఓ
రూపం ఇవ్వండి.
ఒక్కసారి నిజరూపం తెలుసుకున్నామా...ఇక విశ్వరూపం మొదలవుతుంది. అది ఏ కలెక్టరు
ఉద్యోగమో కానక్కర్లేదు. గొప్పవని అ౦దరూ అనుకునే వృత్తుల జాబితాలో
లేకపోవచ్చు. ప్రపంచానికంతా చిన్నచూపు ఉండవచ్చు. జీతమూ అంతంతమాత్రమే కావచ్చు.
అది చదువే అయితే, ఏ ఇంజినీరింగో మెడిసినో కావాలన్న నిబంధన కూడా లేదు. మీ
మార్గాన్ని మీరు ధైర్యంగా సగర్వంగా ఎంచుకోండి. వినదగునెవ్వరు చెప్పిన. కానీ
అంతిమ నిర్ణయం మీదే. 'మీకు నచ్చిన చదువే చదవండి. మీకు నచ్చిన పనే చేయండి. ఇంతకు
మించిన విజయరహస్యం లేదు' అంటారు నోబెల్ విజేత వెంకటరామన్ రామకృష్ణన్.
కెరీర్ విషయంలో, జీవిత లక్ష్యాల విషయంలో... లాజికల్‌గా ఆలోచించడం కంటే
హృదయలాజికల్‌గా ఆలోచించడమే ఉత్తమం.
అదిగో... చిటారుకొమ్మన మిఠాయి స్వప్నం... మునుపటికంటే స్పష్టంగా
కనిపిస్తోందిప్పుడు. గురిపెట్టడమే ఆలస్యం. ఆయుధాలకు పదునుపెట్టుకోండి.
భూమి సూర్యునిచుట్టూ తిరిగినట్టు... ప్రధాన లక్ష్యాల చుట్టూ ఉపలక్ష్యాలూ అనుబంధ
లక్ష్యాలూ తిరుగుతూ ఉంటాయి. *రక్షణ దళాల్లో చేరడమన్నది ప్రధాన లక్ష్యం
అనుకోండి. ప్రెసిడెంట్ మెడల్ సాధించడం, పంద్రాగస్టు పరేడ్‌లో
పాల్గొనడం...ఇలాంటివన్నీ ఉపలక్ష్యాలు.* అసలు లక్ష్యం సాధిస్తేనే ఈ కొసరు కలలు
నిజమవుతాయి. ప్రణాళికలో స్వల్పకాలిక లక్ష్యాలుండాలి, దీర్ఘకాలిక
లక్ష్యాలుండాలి. రెంటికీ మధ్య లింకులూ తప్పనిసరి. స్వల్పకాలిక లక్ష్యాలన్నవి
నిచ్చెన మెట్లలాంటివి. దేనికదే ప్రత్యేకమైనా... అంతిమంగా దీర్ఘకాలిక
లక్ష్యానికి ఉపయోగపడాలి. మనల్ని అన్నిటికంటే పైమెట్టుకు తీసుకెళ్లాలి.
ప్రణాళికలో ప్రాథమ్యాలు ముఖ్యం. ముందు దృష్టిపెట్టాల్సిన అంశాలేమిటి? ఆతర్వాత,
అంతుచూడాల్సిన విషయాలేమిటి? అన్న స్పష్టత ఉండాలి. ఉద్యోగం తెచ్చుకోవడం అన్నది
ఓ మేనేజ్‌మెంట్ పట్టభద్రుడి స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అంతటితో ఆగిపోతే
అక్కడే మిగిలిపోతాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు స్థాయికి ఎదగాలన్నది
దీర్ఘకాలిక లక్ష్యం. ఒక రోజులో, ఒక ఏడాదిలో సాధించేది కాదది. కొన్నిసార్లు
జీవితకాలం పట్టవచ్చు. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలి. నైపుణ్యాలకు పదునుపెట్టుకోవాలి. *మన
ఆలోచనలూ అభిరుచులూ అలవాట్లూ ప్రధాన లక్ష్యం చుట్టూ ముడిపడినపుడే అది
సాధ్యమవుతుంది*. *ప్రణాళికకు తగినట్టుగా ఆలోచించేలా మన మెదడును ట్యూన్
చేసుకోవాలి. లక్ష్యానికి ఉపకరించేలా మన అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి.
ఎదుగుదలకు సహకరించేలా మన అభిరుచుల్ని పెంపొందించుకోవాలి.* అంతెందుకు, లక్ష్యమే
మన సర్వస్వం కావాలి. నిర్ణీత వ్యవధుల్లో ఎదుగుదలను సమీక్షించుకోవడం,
జయాపజయాల్ని బేరీజు వేసుకోవడం, పరిస్థితులను బట్టి ప్రణాళికలో మార్పుచేర్పులు
చేసుకోవడం చాలా అవసరం.
ఒక్కసారి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, మనం ఆలోచించే పద్ధతే మారిపోతుంది. సినిమా
చూస్తున్నా, టీవీ చూస్తున్నా, పేపరు తిరగేస్తున్నా, పుస్తకం చదువుతున్నా,
నిద్రపోతున్నా...మన బుర్రలోని సృజనాత్మక విభాగం ప్రణాళిక గురించే ఆలోచిస్తూ
ఉంటుంది. అవసరమైన పాయింటు తగలగానే, గిల్లిమరీ గుర్తుచేస్తుంది. రోజువారీ
జీవితంలో కూడా బోలెడంత తేడా కనిపిస్తుంది. 'చల్తాహై...' ధోరణి దరిదాపుల్లోకి
కూడా రాదు. మన అలవాట్లు కూడా లక్ష్యానికి అనుగుణంగా మారిపోతాయి. 'అలవాట్లే నీ
గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తాయి' . *లక్ష్యసాధకులెవరూ సూర్యుడు నడినెత్తిన
వచ్చేదాకా నిద్రపోరు. లక్ష్యం నిద్రపోనివ్వదు కూడా*. ప్రణాళిక ద్వారా మనం
సాధించబోయే విజయాలు జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేస్తాయి. ఆశావాదాన్ని
నూరిపోస్తాయి. ఎదురుదెబ్బలూ చేదు అనుభవాలూ మనల్నేమీ చేయలేవు. స్నేహితుల
ఎంపికలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. మన ఆలోచనా స్థాయికి చేరుకున్నవారికే
మిత్రబృందంలో చోటిస్తాం. ఎవరైనా చేరుకోకపోతే, ఎలా చేరుకోవాలో నేర్పిస్తాం.
అవసరమైతే చేయిపట్టుకుని నడిపిస్తాం. అన్నిటికీ మించి బాధ్యత అలవడుతుంది.
ఎందుకంటే, మన ప్రణాళికకు మనమే జవాబుదారులం. ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో అనుకున్నది
సాధించకపోతే ఆ అక్షరాలు నిలదీస్తాయి.
*కేవలం డబ్బు వల్లే ఎవరూ సుఖపడిన దాఖలాల్లేవు. *కానీ డబ్బు లేకపోవడం వల్ల
కష్టాలపాలైన వారు చాలా మందే ఉన్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా డబ్బు
ప్రాధాన్యం డబ్బుదే. భవిష్యత్ అవసరాలకు సరిపడినంత, కుటుంబ బాధ్యతలకు తగినంత
సంపాదన అవసరమే. ఆ సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేశామన్నదీ ముఖ్యమే. ఆ పొదుపును
ఎంత తక్కువ సమయంలో ఎంత సురక్షితంగా రెట్టించామన్నది ఇంకా ముఖ్యం. ప్రభుత్వ
ర౦గ బ్యా౦కులు , తపాలా శాఖవారి చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పబ్లిక్
ప్రావిడెంట్ ఫండ్ ... అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించాలి. సురక్షితమైన
మార్గాల్ని ఎంచుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. నెలవారీ ప్రణాళికతో
మొదలుపెట్టి...రిటైర్మెంట్ దాకా ప్రతి దశకూ పక్కా ప్రణాళిక ఉండాలి.
ఒక్కసారిగా కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యమే కానీ, పాతికేళ్ళ ప్రణాళికతోనో
ముప్ఫై ఏళ్ళ ఆర్థిక వ్యూహంతోనో కోటి రూపాయలు పొదుపుచేయడం పెద్ద కష్టమేం కాదు.
పాతికేళ్ళ కుర్రాడు నెలకు ఆరువేల చొప్పున పబ్లిక్ ప్రావిడెంట్‌ఫండ్ ఖాతాలో
జమ చేసినా...రిటైర్మెంట్ నాటికి కనీసం అరకోటీశ్వరుడు అవుతాడు. కుటుంబానికి
ఆరోగ్యబీమా, మనం లేనప్పుడు ఆదుకోడానికి టర్మ్ పాలసీ, ఓ వెచ్చని నీడ...ఆర్థిక
ప్రణాళికలో భాగమే. పొదుపు-మదుపులకు సంబంధించి నెలవారీ లక్ష్యాలూ వార్షిక
లక్ష్యాలూ దశాబ్ద లక్ష్యాలూ రిటైర్మెంట్ లక్ష్యాలూ...సవివరంగా
సిద్ధంచేసుకోవాలి.
ఆ మాటతో రాజుగారికి జ్ఞానోదయమై౦ది.*
*సంపాదనకైనా, సంపాదించాలన్న ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం. ఆ సంతృప్తి లేకపోతే
మనశ్శాంతి కరవవుతుంది. ఏ కొద్దిమందిలోనో ఆ సంతృప్తి కనిపిస్తుంది. మనం ఎంత
సంపాదించినా...అందులో ఐదుశాతమో పదిశాతమో సమాజానికి కేటాయించాలన్న నిర్ణయం
తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని మన ప్రణాళికలో భాగం చేసుకుంటే ఆస్తులతోపాటు
ఆత్మసంతృప్తీ పెరుగుతుంది.*
*వికాస యాత్ర...*
*ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించిన ఘనుడు.
ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆ కుబేరుడి అపాయింట్‌మెంట్ కోసం
ఎదురుచూస్తుంటారు. అంత డబ్బుంది. అంత పరపతి ఉంది. వందలకోట్ల వ్యాపార
సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించి, ఆరోజే పదవీవిరమణ చేయబోతున్నాడు. చేతిలో
చిల్లిగవ్వకూడా లేకుండా జీవితాన్ని ప్రారంభించిన ఆ విజేతకు వీడ్కోలు పలకడానికి
మహామహులంతా సిద్ధంగా ఉన్నారు. ఆయన మాత్రం దిగాలుగా తన ఛాంబర్‌లో కూర్చుని దేని
కోసవో వెతుకుతున్నాడు. ఓ ఉన్నతోద్యోగి ధైర్యంచేసి అడిగాడు...'అయ్యా! ఏదో
ముఖ్యమైన కాగితం కోసం వెదుకుతున్నట్టున్నారు'. 'కాగితం కోసం కాదయ్యా! నేను
పోగొట్టుకున్న జీవితం కోసం'...దిగాలుగా జవాబిచ్చాడు వ్యాపారవేత్త. జీవితమంటే...
కెరీర్, డబ్బు మాత్రమే కాదు. బంధాలు, ఆసక్తులు, అభిరుచులు, అనుభూతులు,
ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా! ఆ కోణమూ లేకపోతే మన ప్రణాళిక అసమగ్రమే.*
ప్రతి ఆరోగ్యవంతుడి తలమీదా ఓ కిరీటం ఉంటుంది. అది రోగిష్టివాళ్లకు మాత్రమే
కనబడుతుంది. పోగొట్టుకున్నాకే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. కానీ ఒకసారి
పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. బాల్యం నుంచే ఆరోగ్యకరమైన
అలవాట్లను పెంపొందించుకోవాలి. పెడదార్లు పట్టకుండా జాగ్రత్తపడాలి. వూబకాయం,
అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు అతి సాధారణమైపోయిన రోజుల్లో... అసలు ఆ
రోగాలు మన దరిదాపులకు రాకుండా ఉండాలంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ
తీసుకోవాలి. పొరపాటున మన జోలికి వస్తే వాటిని ఎలా నియంత్రణలో పెట్టాలన్నదీ
ఆలోచించాలి. వైద్యం, ఆహార విధానం, వ్యాయామం, జీవనశైలి...దేన్నీ తక్కువచేయలేం.
ఆరోగ్య ప్రణాళిక అంతిమ లక్ష్యం...నా ఇంట్లో మందుల అరతో అవసరమేలేని రోజంటూ
రావాలి అన్నదే.
*హాబీలకూ ప్రణాళికలో స్థానం ఉండాలి. ఈ ఏడాది కూచిపూడిలో అరంగేట్రం చేయాలి...
రెండే*ళ్ళ *లో నేను వేయాలనుకున్న పెయింటింగ్లను పూర్తిచేసి ఓ ప్రదర్శన
పెట్టాలి...ఐదేళ్లనాటికి రచయితగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి... ఇలా హాబీ
మనలోని సృజనని వెలికితీస్తుంది. ఆ శక్తిలో కొంత వృత్తిజీవితానికీ
మళ్ళిoచుకోవచ్చు.*
*నేర్చుకునే మనసుండాలే కానీ, వృక్షాలు మాట్లాడతాయి. రాళ్ళు ప్రవచిస్తాయి.
సెలయే**ళ్ళు** గ్రంథాలవుతాయి. ప్రయాణాల్ని మించిన వ్యక్తిత్వ వికాసమార్గం
లేదు.** **భారతదేశములో **కొత్తకొత్త ప్రదేశాలు, కొత్తకొత్త పరిచయాలు,
కొత్తకొత్త స్నేహాలు, కొత్తకొత్త అనుభవాలు... జీవితానికి కొత్త
ఉత్సాహాన్నిస్తాయి. కొత్త ఆలోచనల్ని ప్రసాదిస్తాయి. ఏడాదికి కనీసం
పదిహేనురోజులు ఏదో ఓ కొత్త ప్రదేశానికి వెళ్లడానికి కేటాయించుకోండి. అందుకయ్యే
ఖర్చులు, చేసుకోవాల్సిన ఏర్పాట్లు, అనువైన సమయం, బస, భోజనం...తదితర వివరాలన్నీ
పర్యాటక ప్రణాళికలో భాగం.*
పాతికేళ్ల వయసులోనూ నలభై ఏళ్ల వయసులోనూ ప్రపంచం మీ కళ్లకు ఒకేలా
కనిపించిందంటే, మీరు పదిహేనేళ్ల కాలాన్ని వృథా చేసినట్టే. ఎదిగేకొద్దీ పరిణతి
చాలా ముఖ్యం. ఉత్తమ సాహిత్యం, సత్సాంగత్యం మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి.
ఆధ్యాత్మికత ప్రభావమూ చాలా ఉంటుంది. ఇది వికాస ప్రణాళిక.
పర్యాటకం, ఆర్థికం, హాబీలు, ఆరోగ్యం వగైరా వగైరా దేనికదే విడిగా అనిపిస్తున్నా
అంతస్సూత్రం ఒకటే. మీకిష్టమైన కూచిపూడిలో పద్మశ్రీ అవార్డు అందుకోడానికి
వీల్‌ఛెయిర్ మీద వెళ్లకూడదనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. నచ్చిన ప్రాంతానికి
వెళ్లడానికి ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన దుస్థితి రాకూడదంటే, ఆర్థికంగా ఉన్నత
స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేని అంశాలే. మీరూ మీ ఆలోచనలూ మీ
అలవాట్లూ మీ లక్ష్యాలూ మీ విజయాల్లా!
ఎడిసన్ కథ మనకు తెలిసిందే. తన ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమయ్యాడు. ఓ దశలో
నిరాశ కమ్మేసింది. ఇక తనవల్ల కాదేవో అనుకున్నాడు. అప్పుడే ఓ మిత్రుడు వచ్చాడు.
ఎడిసన్ మొహంలో కనిపిస్తున్న నిరాశానిస్పృహల్ని చూడగానే అతనికి విషయం
అర్థమైపోయింది.
'నీకు అన్నిటికంటే ఇష్టమైన పనేమిటి' అనడిగాడు...
'బల్బు తయారు చేయడం' నిర్వేదంగా చెప్పాడు ఎడిసన్.
'మరి, ఎందుకింత నిరాశ?'
'వేయిసార్లు విఫలమయ్యాను మిత్రమా'
'అలా ఎందుకనుకోవాలి? నీకు ఇష్టమైన పని వేయిసార్లు చేసే అవకాశం వచ్చిందని
అనుకోవచ్చుగా'
వైఫల్యాల్ని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవచ్చో ఎడిసన్‌కు అర్థమై౦ది. ఈసారి
ఓటమి భయంలేకుండా పరిశోధన చేశాడు. విద్యుత్‌దీపాన్ని ఆవిష్కరించాడు.
నరేంద్ర ముర్కుంబీ అనే యువకుడు నానా కష్టాలూ పడి ఓ చక్కెర ఫ్యాక్టరీని
కొన్నాడు. ఎంత ఆలోచించినా దాన్ని నష్టాల్లోంచి ఒడ్డుకేయడం ఎలానో అర్థంకాలేదు.
దాదాపు ఆరునెలలు ఫ్యాక్టరీలోనే గడిపాడు. తిండీ నిద్రా అక్కడే. ఓ మూలనపడేసిన
చెరుకుపిప్పితో సహా...అణువణువూ పరిచయమైపోయింది. అప్పుడొచ్చిన ఆలోచనే... చెరుకు
పిప్పితో విద్యుదుత్పత్తి! ఆయన నాయకత్వంలోని 'గాయత్రి షుగర్' పదేళ్లలో
వేయికోట్ల టర్నోవరును అధిగమించింది. వైఫల్యం నేర్పే పాఠాలు ఇంత గొప్పగా
ఉంటాయి.
పడుతూలేస్తూ సరిదిద్దుకుంటూ సరిపుచ్చుకుంటూ ఓ అడుగు వెనకేస్తూ రెండడుగులు
ముందుకేస్తూ ధైర్యంగా ముందుకెళ్ళడమే జీవితం. ఆ ప్రయాణంలో ఓ ఆసరా... ప్రణాళిక.
విజయాక్షరాలు
మాట మంత్రాక్షరం. స్తబ్ధతను తరిమే చైతన్య అస్త్రం. దిశ చూపే దిక్సూచి. చీకటిని
గెలిచే దివిటీ. పుస్తకాల్లో రాసుకోండి. గోడమీద అతికించుకోండి. హృదయాల్లో
ప్రతిష్ఠించుకోండి. ప్రణాళికా రథానికి ఈ విజయాక్షరాలే...ఇంధనాలు. శ్రమ నీకు
ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది. అసాధ్యమైన దాన్నిఆశించు. కనీసం
అత్యుత్తమమైనదైనా అందుతుంది. విజయం అంటే, ఆశించినదాన్ని సాధించడం కాదు.
సాధించవలసిన దాన్ని అందుకోవడం. వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా
విధానమే మూలం. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది
కావాలి. ప్రయత్నించనిదే
ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లోపడదు. గెలవాలన్న తపన
ఉన్నచోట, ఓటమి అడుగైనా పెట్టలేదు. ఈ రోజు మన జీవితం, నిన్నటి ఆలోచనల
ఫలితమే. పరాజయం
అంటే, నువ్వు చేసే పనిని వదిలి పారిపొమ్మని కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా
నేర్పుగా పట్టుదలగా చేయమని అర్థం. విజయం ఒక గమ్యం కాదు. గమనం మాత్రమే.
ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది. గొప్ప లక్ష్యాన్ని
సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడం
నేరం. అసంభవం అన్న పదం అసమర్థుల నిఘంటువుల్లోనే కనిపిస్తుంది. వజ్రసంకల్పం కలిగిన వ్యక్తి
ప్రపంచాన్నే తన అభీష్టానికి అనుగుణంగా మలచుకుంటాడు. ప్రతి చిన్న అవాంతరానికీ
సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరమవుతారు. అంతరాలు కలిగేకొద్దీ
సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. ఒక పని కష్టమని మనం దాన్ని చేయడానికి
భయపడం. మనం భయపడతాం కనుక ఆ పని కష్టమనిపిస్తుంది. ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు,
ఎదురునడుస్తూ పోవడమే విజయరహస్యం. విజయశిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో
కృషిచేసే వారికి అవి తలవంచుతాయి. విజేత వెనక ఉండేది అదృష్టవో మంత్రదండవో
కాదు... చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకితభావం.
విజయం అంటే, ఆశించినదాన్ని సాధించడం కాదు. సాధించవలసిన దాన్ని అందుకోవడం.
శ్రమ నీకు ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది.
నీ చేతిలో విల్లు ఉందా ?'
సిదంగా ఉంది. ఇప్పుడే వింటినారీ బిగించాను '
;బాణం ?'
'ఎక్కుపెట్టి వధిలితే చాలు ,రివ్వున దూసుకువెల్ళిపోతుంధీ '
'ఆలస్యమెందుకు? లక్ష్యానికి గురిపెట్టు?'
'లక్ష్యమా! అదెక్కడుంది?'
ఎంత అద్భుతమైన విల్లు అయితేనేం. ఎంత పదునుదేలిన బాణం ఉంటేనేం. లక్ష్యాన్ని
చూడలేకపోతున్నప్పుడు, గురిపెట్టాల్సిందేదో గురుతే లేనప్పుడు.
ఆలోచన స్పష్టంగా ఉన్నప్పుడు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. లక్ష్యం స్పష్టంగా
ఉన్నప్పుడు అమలు స్పష్టంగా ఉంటుంది. అమలు స్పష్టంగా ఉన్నప్పుడు...భవిష్యత్
కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పష్టత, ఆ భవిష్యత్ దర్శనశక్తి, ఆ
దూరదృష్టి... చక్కని ప్రణాళిక ద్వారానే సాధ్యం. నేటికీ రేపటికీ మధ్య మనం
కట్టుకునే కలల వంతెన ప్రణాళిక. కలకూ నిజానికీ మధ్య మనం నిర్మించుకునే రంగుల
రాచబాట ప్రణాళిక. రివ్వున ఎగురుతున్న గాలిపటానికీ హుషారుగా ఎగరేస్తున్న
పిల్లాడికీ మధ్య మాంజా లాంటిది ప్రణాళిక. పక్షి నింగికి ఎగిరేముందు ఒక్కసారి
రెక్కలల్లార్చుకుంటుందే, అదే ప్రణాళిక! సింహం శత్రువు మీదికి ఉరుకుతున్నప్పుడు
చుట్టూ పరికించి చూస్తుందే, అదే ప్రణాళిక! చెరువులోని చేపపిల్ల చిట్టిపొట్టి
పురుగుల్ని గబుక్కున మింగేయడానికి ముందు ఒక్క క్షణం నిశ్శబ్దంగా గమనిస్తుందే,
అదే ప్రణాళిక!
చూడలేకపోతున్నప్పుడు, గురిపెట్టాల్సిందేదో గురుతే లేనప్పుడు.
ఆలోచన స్పష్టంగా ఉన్నప్పుడు లక్ష్యం స్పష్టంగా ఉంటుంది. లక్ష్యం స్పష్టంగా
ఉన్నప్పుడు అమలు స్పష్టంగా ఉంటుంది. అమలు స్పష్టంగా ఉన్నప్పుడు...భవిష్యత్
కళ్లముందు కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పష్టత, ఆ భవిష్యత్ దర్శనశక్తి, ఆ
దూరదృష్టి... చక్కని ప్రణాళిక ద్వారానే సాధ్యం. నేటికీ రేపటికీ మధ్య మనం
కట్టుకునే కలల వంతెన ప్రణాళిక. కలకూ నిజానికీ మధ్య మనం నిర్మించుకునే రంగుల
రాచబాట ప్రణాళిక. రివ్వున ఎగురుతున్న గాలిపటానికీ హుషారుగా ఎగరేస్తున్న
పిల్లాడికీ మధ్య మాంజా లాంటిది ప్రణాళిక. పక్షి నింగికి ఎగిరేముందు ఒక్కసారి
రెక్కలల్లార్చుకుంటుందే, అదే ప్రణాళిక! సింహం శత్రువు మీదికి ఉరుకుతున్నప్పుడు
చుట్టూ పరికించి చూస్తుందే, అదే ప్రణాళిక! చెరువులోని చేపపిల్ల చిట్టిపొట్టి
పురుగుల్ని గబుక్కున మింగేయడానికి ముందు ఒక్క క్షణం నిశ్శబ్దంగా గమనిస్తుందే,
అదే ప్రణాళిక!
ఓ పదేళ్ల వ్యవధిలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న వందమంది విద్యార్థుల
మీద ఓ అధ్యయనం చేశారు. అందులో ఎనభైమూడు మందికి అసలు లక్ష్యాలే లేవు. పద్నాలుగు
మందికి లక్ష్యాలున్నాయి కానీ, ఎలా సాధించాలనే ప్రణాళికలేదు. ముగ్గురికి
మాత్రం...స్పష్టమైన లక్ష్యాలున్నాయి, అక్షరబద్ధమైన ప్రణాళికలున్నాయి. పదేళ్ల
తర్వాత చూస్తే...ఆ పద్నాలుగుమందీ మిగతా ఎనభైమూడుమందికంటే...పదిరెట్లు ఎక్కువ
సంపాదిస్తున్నారు. ఆ ముగ్గురూ పద్నాలుగుమంది కంటే వందరెట్లు ఉన్నతమైన
స్థానాల్లో ఉన్నారు.
అదీ ప్రణాళిక శక్తి!
మరి, మీ ప్రణాళిక ఏమిటి? అసలు మీకంటూ ఓ ప్రణాళిక ఉందా? ఉంటే, సంతోషం. ఆ మ్యాపు
ప్రకారం ముందుకెళ్లండి. అసలు ప్రణాళికే లేదా? అయినా ఫర్వాలేదు.
ఇప్పుడు ప్రారంభించండి.
ప్రణాళికా రచనలో ఐదు దశలున్నాయి. ఒకటి- ఆలోచన, రెండు- లక్ష్యం, మూడు- వ్యూహం,
నాలుగు- అమలు, ఐదు- బేరీజు.

*ఆలోచనే ఆయుధం*
మనిషి ఆలోచనా జీవి. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలు నిద్రలోనూ
వదిలిపెట్టవు. రోజూ మనకు అరవైవేల ఆలోచనలు వస్తుంటాయి. అందులో తొంభైశాతం
నెగెటివ్ ఆలోచనలే. చాలా సందర్భాల్లో, ఒకే ఆలోచన పదేపదే బుర్రను తొలిచేస్తూ
ఉంటుంది. ఒక్కటీ పనికొచ్చేది ఉండదు. మన మనసుకు ఓ పరిమితి ఉంది. ఒకసారి ఒక
విషయాన్ని మాత్రమే ఆలోచిస్తుంది. ఆ ఒక్క ఆలోచనా గాలివాటంగా వచ్చేదే
ఎందుక్కావాలి? మనం ఎంచుకున్నదే కావచ్చుగా! *మనం ఏం ఆలోచించాలన్నది మనమే
నిర్ణయించుకోవచ్చుగా. అదేం అసాధ్యం కాదు. సాధనతో సమకూరుతుంది. ప్రాణాయామంలో,
ధ్యానంలో జరిగేది అదే.*
నోబెల్ సాధించాలి, శాస్త్రవేత్తగా పేరుతెచ్చుకోవాలి, ...ఇలా ఓ పట్టాన
నిద్రపోనివ్వని పాజిటివ్ ఆలోచనలకు స్పష్టమైన రూపం వస్తే, అదే లక్ష్యం. ఈ
దశలోనే 'ఎలా' అన్న ప్రశ్న తలెత్తేది. ఎదగాలనుకుంటాం. ఎలా ఎదగాలో తెలియదు.
సాధించాలనుకుంటాం. ఎలా సాధించాలో తేల్చుకోలేం. ఈ సమయంలో ఎటెళ్ళాలో తెలిపే
దిక్సూచి కావాలి. ఏ దారి మనల్ని గమ్యానికి చేరుస్తుందో తెలిపే రోడ్‌మ్యాప్
కావాలి. ఎంత సమయంలో ఎంతదూరం వెళ్ళలగలవో లెక్కగట్టడానికి కత్తిలాంటి
కాలిక్యులేటర్ కావాలి. ప్రతినిమిషం, ప్రతిగంటా గంటకొట్టి వెన్నుతట్టడానికి
గడియారం కావాలి. రోజులు గడిచిపోతున్నాయని చెవి మెలేసి మరీ గుర్తుచేయడానికి
క్యాలెండరు కావాలి. పరిపూర్ణమైన ప్రణాళికలో ఈ సాధన సంపత్తి అంతా ఉంటుంది.
*ముడిసరకు సిద్ధమా?*
*ప్రణాళిక రాసుకోడానికి ఖరీదైన నోటుబుక్కూ రంగురంగుల స్కెచ్ పెన్నులూ
అక్కర్లేదు. భాష అత్యద్భుతంగా లేకపోయినా ఫర్వాలేదు. కానీ రాతలో నిజాయతీ ఉండాలి.
ప్రతి అక్షరంలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. మనం శక్తిమంతులం. *సృజనాత్మక
వ్యక్తులం. ఒక్కసారి గుర్తుచేసుకోండి. చిన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉంటాం! ఎంత
గొప్పగా ఆలోచిస్తాం! ఆకాశంలో విమానం కనిపించగానే, 'పెద్దయ్యాక పైలెట్
అవుతానోచ్' అని ప్రకటించేస్తాం. 'నీ వెుహం! ఆ చదువు చదవాలంటే బోలెడంత డబ్బు
కావాలి' అంటూ ఆశల మీద దోసెడు నీళ్లు చల్లేస్తారు పెద్దవాళ్ళు. టీవీలో
కిరణ్‌బేడీని చూడగానే 'ఐపీఎస్ ఆఫీసర్ని అవుతా' అని పబ్లిక్ స్టేట్‌మెంట్
ఇచ్చేస్తాం. 'బక్కపీచు వెధవా, నీకు పోలీసు ఉద్యోగమెందుకు?'... నిర్దాక్షిణ్యంగా
కలల్ని కాలరాచేస్తారు చుట్టూ ఉన్న జనం. ఎదిగేకొద్దీ మన కలలు కురచైపోతాయి.
ఆత్మవిశ్వాసం చిక్కిశల్యమైపోతుంది. పట్టాచేతికొస్తే అదే పదివేలని
సర్దుకుపోతాం. గుమస్తా ఉద్యోగమైనా చాలనుకునే స్థితికి వచ్చేస్తాం. వ్యక్తిత్వ
వికాస నిపుణుడు రాబిన్‌శర్మ ఇలాంటి పరిమితుల్ని 'కనిపించని కంచెలు' అంటాడు.
ముందు ఆ మాయల ముళ్ళపొదల్ని పెకిలించి వేయండి. అవి మీ దరిదాపుల్లో కూడా
ఉండటానికి వీల్లేదు. ఇప్పుడు మీ ప్రణాళికా రచనకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు.
పసివాడిగా ఉన్నప్పుడు ఎలా ఆలోచించారో అలానే ఆలోచించండి. మీలో అంతర్లీనంగా ఉన్న
సృజననంతా వెలికితీయండి. మoచి కలలు కనండి. అపారమైన ఆత్మవిశ్వాసాన్ని
పోగుచేసుకోండి. గొప్పగొప్ప లక్ష్యాల్ని నిర్దేశించుకోండి. కంచెల్లేవ్.
కందకాల్లేవ్. సరిహద్దుల్లేవ్. శృంఖలాల్లేవ్. ఇప్పుడు, మీ జీవిత ప్రణాళికకు ఓ
రూపం ఇవ్వండి.
అభిరుచి, ఇష్టం, వ్యక్తిత్వం, నైపుణ్యం, కలలు, కళలు, పరిమితులు, ప్రాథమ్యాలు...
ఏ ఒక్కటీ వదలకుండా కాగితం మీద పెట్టండి. ఇవన్నీ తెలియని విషయాలేం కాదు. కానీ
అక్షరాల్లో రాసుకున్నప్పుడు వచ్చే స్పష్టత వేరు. మన నిజరూపం ఏమిటో మనకు
అర్థమైపోతుంది. వ్యక్తిత్వవికాస శిక్షకులు దీన్నే 'కోర్ కాంపిటెన్సీ' అంటారు.
ఉదాహరణకు...చార్లెస్ డార్విన్ మతబోధకుడిగా పనిచేశాడు. ఉపాధ్యాయుడిగా
పనిచేశాడు. చిన్నాచితకా ఉద్యోగాలు చాలానే చేశాడు. జీవశాస్త్రవేత్త...అన్నదే ఆయన
నిజరూపం. మీ నిజరూపం ఏమిటో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది.
విద్యార్థికి- ఇంజినీరింగ్, మెడిసిన్, ఆర్కిటెక్చర్, ఆర్ట్స్, కామర్స్.
పట్టభద్రుడికి- ఉద్యోగం, వ్యాపారం, సేవ.

రిటైర్డ్ ఉద్యోగికి- విశ్రాంతి, పార్ట్‌టైమ్ ఉద్యోగం, ఆధ్యాత్మిక జీవితం.
...వేయిదార్లు కనిపించవచ్చు. లక్ష అవకాశాలు తలుపుతట్టవచ్చు. శతకోటి ఊరింపులు
ఉంటే ఉండవచ్చు. 'రాళ్ళున్నా రప్పలున్నా సమస్యలున్నా సుడిగుండాలున్నా..ఇదే నా
దారి. ఆ నడకలోనే ఆనందం పొందుతాను. ఆ సవాళ్ళనే సమర్థంగా ఎదుర్కొంటాను. అసలు నేను
ఈ పనిచేయడానికే పుట్టాను. నా జీవిత పరమార్థమే ఇది' అనిపించే వ్యాపకానికే మన ఓటు
వేయాలి. దాని చుట్టే కలల్ని అల్లుకోవాలి. లక్ష్యాల్ని నిర్మించుకోవాలి. జీవిత
ప్రణాళికలో తొలివాక్యం దాంతోనే ప్రారంభం కావాలి. ఐదేళ్ళ తర్వాతో పదేళ్ళ తర్వాతో
మీరు ప్రపంచానికి పరిచయం అయ్యేది ఆ గుర్తింపుతోనే. మీరు లేకపోయినా మిమ్మల్ని
గుర్తుంచుకునేది కూడా ఆ కారణంగానే.
...వేయిదార్లు కనిపించవచ్చు. లక్ష అవకాశాలు తలుపుతట్టవచ్చు. శతకోటి ఊరింపులు
ఉంటే ఉండవచ్చు. 'రాళ్ళున్నా రప్పలున్నా సమస్యలున్నా సుడిగుండాలున్నా..ఇదే నా
దారి. ఆ నడకలోనే ఆనందం పొందుతాను. ఆ సవాళ్ళనే సమర్థంగా ఎదుర్కొంటాను. అసలు నేను
ఈ పనిచేయడానికే పుట్టాను. నా జీవిత పరమార్థమే ఇది' అనిపించే వ్యాపకానికే మన ఓటు
వేయాలి. దాని చుట్టే కలల్ని అల్లుకోవాలి. లక్ష్యాల్ని నిర్మించుకోవాలి. జీవిత
ప్రణాళికలో తొలివాక్యం దాంతోనే ప్రారంభం కావాలి. ఐదేళ్ళ తర్వాతో పదేళ్ళ తర్వాతో
మీరు ప్రపంచానికి పరిచయం అయ్యేది ఆ గుర్తింపుతోనే. మీరు లేకపోయినా మిమ్మల్ని
గుర్తుంచుకునేది కూడా ఆ కారణంగానే.
ఒక్కసారి నిజరూపం తెలుసుకున్నామా...ఇక విశ్వరూపం మొదలవుతుంది. అది ఏ కలెక్టరు
ఉద్యోగమో కానక్కర్లేదు. గొప్పవని అ౦దరూ అనుకునే వృత్తుల జాబితాలో
లేకపోవచ్చు. ప్రపంచానికంతా చిన్నచూపు ఉండవచ్చు. జీతమూ అంతంతమాత్రమే కావచ్చు.
అది చదువే అయితే, ఏ ఇంజినీరింగో మెడిసినో కావాలన్న నిబంధన కూడా లేదు. మీ
మార్గాన్ని మీరు ధైర్యంగా సగర్వంగా ఎంచుకోండి. వినదగునెవ్వరు చెప్పిన. కానీ
అంతిమ నిర్ణయం మీదే. 'మీకు నచ్చిన చదువే చదవండి. మీకు నచ్చిన పనే చేయండి. ఇంతకు
మించిన విజయరహస్యం లేదు' అంటారు నోబెల్ విజేత వెంకటరామన్ రామకృష్ణన్.
కెరీర్ విషయంలో, జీవిత లక్ష్యాల విషయంలో... లాజికల్‌గా ఆలోచించడం కంటే
హృదయలాజికల్‌గా ఆలోచించడమే ఉత్తమం.
అదిగో... చిటారుకొమ్మన మిఠాయి స్వప్నం... మునుపటికంటే స్పష్టంగా
కనిపిస్తోందిప్పుడు. గురిపెట్టడమే ఆలస్యం. ఆయుధాలకు పదునుపెట్టుకోండి.
*వ్యూహాత్మకంగా...*
భూమి సూర్యునిచుట్టూ తిరిగినట్టు... ప్రధాన లక్ష్యాల చుట్టూ ఉపలక్ష్యాలూ అనుబంధ
లక్ష్యాలూ తిరుగుతూ ఉంటాయి. *రక్షణ దళాల్లో చేరడమన్నది ప్రధాన లక్ష్యం
అనుకోండి. ప్రెసిడెంట్ మెడల్ సాధించడం, పంద్రాగస్టు పరేడ్‌లో
పాల్గొనడం...ఇలాంటివన్నీ ఉపలక్ష్యాలు.* అసలు లక్ష్యం సాధిస్తేనే ఈ కొసరు కలలు
నిజమవుతాయి. ప్రణాళికలో స్వల్పకాలిక లక్ష్యాలుండాలి, దీర్ఘకాలిక
లక్ష్యాలుండాలి. రెంటికీ మధ్య లింకులూ తప్పనిసరి. స్వల్పకాలిక లక్ష్యాలన్నవి
నిచ్చెన మెట్లలాంటివి. దేనికదే ప్రత్యేకమైనా... అంతిమంగా దీర్ఘకాలిక
లక్ష్యానికి ఉపయోగపడాలి. మనల్ని అన్నిటికంటే పైమెట్టుకు తీసుకెళ్లాలి.
ప్రణాళికలో ప్రాథమ్యాలు ముఖ్యం. ముందు దృష్టిపెట్టాల్సిన అంశాలేమిటి? ఆతర్వాత,
అంతుచూడాల్సిన విషయాలేమిటి? అన్న స్పష్టత ఉండాలి. ఉద్యోగం తెచ్చుకోవడం అన్నది
ఓ మేనేజ్‌మెంట్ పట్టభద్రుడి స్వల్పకాలిక లక్ష్యం మాత్రమే. అంతటితో ఆగిపోతే
అక్కడే మిగిలిపోతాడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు స్థాయికి ఎదగాలన్నది
దీర్ఘకాలిక లక్ష్యం. ఒక రోజులో, ఒక ఏడాదిలో సాధించేది కాదది. కొన్నిసార్లు
జీవితకాలం పట్టవచ్చు. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి.
వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవాలి. నైపుణ్యాలకు పదునుపెట్టుకోవాలి. *మన
ఆలోచనలూ అభిరుచులూ అలవాట్లూ ప్రధాన లక్ష్యం చుట్టూ ముడిపడినపుడే అది
సాధ్యమవుతుంది*. *ప్రణాళికకు తగినట్టుగా ఆలోచించేలా మన మెదడును ట్యూన్
చేసుకోవాలి. లక్ష్యానికి ఉపకరించేలా మన అలవాట్లను తీర్చిదిద్దుకోవాలి.
ఎదుగుదలకు సహకరించేలా మన అభిరుచుల్ని పెంపొందించుకోవాలి.* అంతెందుకు, లక్ష్యమే
మన సర్వస్వం కావాలి. నిర్ణీత వ్యవధుల్లో ఎదుగుదలను సమీక్షించుకోవడం,
జయాపజయాల్ని బేరీజు వేసుకోవడం, పరిస్థితులను బట్టి ప్రణాళికలో మార్పుచేర్పులు
చేసుకోవడం చాలా అవసరం.
*అదే ప్రపంచం*
ఒక్కసారి ప్రణాళిక సిద్ధం చేసుకుంటే, మనం ఆలోచించే పద్ధతే మారిపోతుంది. సినిమా
చూస్తున్నా, టీవీ చూస్తున్నా, పేపరు తిరగేస్తున్నా, పుస్తకం చదువుతున్నా,
నిద్రపోతున్నా...మన బుర్రలోని సృజనాత్మక విభాగం ప్రణాళిక గురించే ఆలోచిస్తూ
ఉంటుంది. అవసరమైన పాయింటు తగలగానే, గిల్లిమరీ గుర్తుచేస్తుంది. రోజువారీ
జీవితంలో కూడా బోలెడంత తేడా కనిపిస్తుంది. 'చల్తాహై...' ధోరణి దరిదాపుల్లోకి
కూడా రాదు. మన అలవాట్లు కూడా లక్ష్యానికి అనుగుణంగా మారిపోతాయి. 'అలవాట్లే నీ
గెలుపు ఓటముల్ని నిర్ణయిస్తాయి' . *లక్ష్యసాధకులెవరూ సూర్యుడు నడినెత్తిన
వచ్చేదాకా నిద్రపోరు. లక్ష్యం నిద్రపోనివ్వదు కూడా*. ప్రణాళిక ద్వారా మనం
సాధించబోయే విజయాలు జీవితం మీద కొత్త ఆశలు చిగురింపజేస్తాయి. ఆశావాదాన్ని
నూరిపోస్తాయి. ఎదురుదెబ్బలూ చేదు అనుభవాలూ మనల్నేమీ చేయలేవు. స్నేహితుల
ఎంపికలోనూ ఆ ప్రభావం కనిపిస్తుంది. మన ఆలోచనా స్థాయికి చేరుకున్నవారికే
మిత్రబృందంలో చోటిస్తాం. ఎవరైనా చేరుకోకపోతే, ఎలా చేరుకోవాలో నేర్పిస్తాం.
అవసరమైతే చేయిపట్టుకుని నడిపిస్తాం. అన్నిటికీ మించి బాధ్యత అలవడుతుంది.
ఎందుకంటే, మన ప్రణాళికకు మనమే జవాబుదారులం. ఐదేళ్ళలోనో పదేళ్ళలోనో అనుకున్నది
సాధించకపోతే ఆ అక్షరాలు నిలదీస్తాయి.
*ఆర్థికంగా...*
*కేవలం డబ్బు వల్లే ఎవరూ సుఖపడిన దాఖలాల్లేవు. *కానీ డబ్బు లేకపోవడం వల్ల
కష్టాలపాలైన వారు చాలా మందే ఉన్నారు. ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా డబ్బు
ప్రాధాన్యం డబ్బుదే. భవిష్యత్ అవసరాలకు సరిపడినంత, కుటుంబ బాధ్యతలకు తగినంత
సంపాదన అవసరమే. ఆ సంపాదించిన దానిలో ఎంత పొదుపు చేశామన్నదీ ముఖ్యమే. ఆ పొదుపును
ఎంత తక్కువ సమయంలో ఎంత సురక్షితంగా రెట్టించామన్నది ఇంకా ముఖ్యం. ప్రభుత్వ
ర౦గ బ్యా౦కులు , తపాలా శాఖవారి చిన్న మొత్తాల పొదుపు పథకాలు, పబ్లిక్
ప్రావిడెంట్ ఫండ్ ... అందుబాటులో ఉన్న అవకాశాల్ని పరిశీలించాలి. సురక్షితమైన
మార్గాల్ని ఎంచుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి. నెలవారీ ప్రణాళికతో
మొదలుపెట్టి...రిటైర్మెంట్ దాకా ప్రతి దశకూ పక్కా ప్రణాళిక ఉండాలి.
ఒక్కసారిగా కోటి రూపాయలు సంపాదించడం అసాధ్యమే కానీ, పాతికేళ్ళ ప్రణాళికతోనో
ముప్ఫై ఏళ్ళ ఆర్థిక వ్యూహంతోనో కోటి రూపాయలు పొదుపుచేయడం పెద్ద కష్టమేం కాదు.
పాతికేళ్ళ కుర్రాడు నెలకు ఆరువేల చొప్పున పబ్లిక్ ప్రావిడెంట్‌ఫండ్ ఖాతాలో
జమ చేసినా...రిటైర్మెంట్ నాటికి కనీసం అరకోటీశ్వరుడు అవుతాడు. కుటుంబానికి
ఆరోగ్యబీమా, మనం లేనప్పుడు ఆదుకోడానికి టర్మ్ పాలసీ, ఓ వెచ్చని నీడ...ఆర్థిక
ప్రణాళికలో భాగమే. పొదుపు-మదుపులకు సంబంధించి నెలవారీ లక్ష్యాలూ వార్షిక
లక్ష్యాలూ దశాబ్ద లక్ష్యాలూ రిటైర్మెంట్ లక్ష్యాలూ...సవివరంగా
సిద్ధంచేసుకోవాలి.
*ఓ పాలకుడు పొరుగురాజ్యాన్ని ఆక్రమించుకోడానికి బయల్దేరే ముందు, గురువుగారి
దర్శనానికి వెళ్లాడు. అదే సమయానికి ఓ పేదవాడూ వచ్చాడు. ఆ నిరుపేద తన జేబులో
భద్రంగా దాచుకున్న రూపాయి నాణాన్ని గురువుగారి చేతిలో పెట్టాడు. 'నాకెందుకు
నాయనా! ఇక్కడ ఎవరైనా పేదవాళ్లుంటే ఇవ్వు' అని సలహా ఇచ్చారాయన. ఆ దరిద్రుడి
దానాన్ని పుచ్చుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. స్వామీజీ అదంతా చూస్తున్నారు.
'అదిగో... ఆ రాజుగారికి ఇవ్వు! పాపం, ఎన్ని సిరిసంపదలు ఉన్నా చాలడం లేదు. మళ్లీ
దండయాత్రకు బయల్దేరుతున్నారు. అంతకంటే నిరుపేద ఇంకెవరుంటారు' అని ఆ పేదవాడితో
చెప్పారు.* *
దర్శనానికి వెళ్లాడు. అదే సమయానికి ఓ పేదవాడూ వచ్చాడు. ఆ నిరుపేద తన జేబులో
భద్రంగా దాచుకున్న రూపాయి నాణాన్ని గురువుగారి చేతిలో పెట్టాడు. 'నాకెందుకు
నాయనా! ఇక్కడ ఎవరైనా పేదవాళ్లుంటే ఇవ్వు' అని సలహా ఇచ్చారాయన. ఆ దరిద్రుడి
దానాన్ని పుచ్చుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. స్వామీజీ అదంతా చూస్తున్నారు.
'అదిగో... ఆ రాజుగారికి ఇవ్వు! పాపం, ఎన్ని సిరిసంపదలు ఉన్నా చాలడం లేదు. మళ్లీ
దండయాత్రకు బయల్దేరుతున్నారు. అంతకంటే నిరుపేద ఇంకెవరుంటారు' అని ఆ పేదవాడితో
చెప్పారు.* *
ఆ మాటతో రాజుగారికి జ్ఞానోదయమై౦ది.*
*సంపాదనకైనా, సంపాదించాలన్న ఆశకైనా ఓ పరిమితి ముఖ్యం. ఆ సంతృప్తి లేకపోతే
మనశ్శాంతి కరవవుతుంది. ఏ కొద్దిమందిలోనో ఆ సంతృప్తి కనిపిస్తుంది. మనం ఎంత
సంపాదించినా...అందులో ఐదుశాతమో పదిశాతమో సమాజానికి కేటాయించాలన్న నిర్ణయం
తీసుకుంటే, ఆ నిర్ణయాన్ని మన ప్రణాళికలో భాగం చేసుకుంటే ఆస్తులతోపాటు
ఆత్మసంతృప్తీ పెరుగుతుంది.*
*వికాస యాత్ర...*
*ఆయనో పెద్ద పారిశ్రామికవేత్త. వ్యాపారాన్ని అంతర్జాతీయంగా విస్తరించిన ఘనుడు.
ప్రధానులు, రాష్ట్రపతులు కూడా ఆ కుబేరుడి అపాయింట్‌మెంట్ కోసం
ఎదురుచూస్తుంటారు. అంత డబ్బుంది. అంత పరపతి ఉంది. వందలకోట్ల వ్యాపార
సామ్రాజ్యాన్ని వారసులకు అప్పగించి, ఆరోజే పదవీవిరమణ చేయబోతున్నాడు. చేతిలో
చిల్లిగవ్వకూడా లేకుండా జీవితాన్ని ప్రారంభించిన ఆ విజేతకు వీడ్కోలు పలకడానికి
మహామహులంతా సిద్ధంగా ఉన్నారు. ఆయన మాత్రం దిగాలుగా తన ఛాంబర్‌లో కూర్చుని దేని
కోసవో వెతుకుతున్నాడు. ఓ ఉన్నతోద్యోగి ధైర్యంచేసి అడిగాడు...'అయ్యా! ఏదో
ముఖ్యమైన కాగితం కోసం వెదుకుతున్నట్టున్నారు'. 'కాగితం కోసం కాదయ్యా! నేను
పోగొట్టుకున్న జీవితం కోసం'...దిగాలుగా జవాబిచ్చాడు వ్యాపారవేత్త. జీవితమంటే...
కెరీర్, డబ్బు మాత్రమే కాదు. బంధాలు, ఆసక్తులు, అభిరుచులు, అనుభూతులు,
ఆరోగ్యం, ఆధ్యాత్మికత కూడా! ఆ కోణమూ లేకపోతే మన ప్రణాళిక అసమగ్రమే.*
ప్రతి ఆరోగ్యవంతుడి తలమీదా ఓ కిరీటం ఉంటుంది. అది రోగిష్టివాళ్లకు మాత్రమే
కనబడుతుంది. పోగొట్టుకున్నాకే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. కానీ ఒకసారి
పోగొట్టుకుంటే తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. బాల్యం నుంచే ఆరోగ్యకరమైన
అలవాట్లను పెంపొందించుకోవాలి. పెడదార్లు పట్టకుండా జాగ్రత్తపడాలి. వూబకాయం,
అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు అతి సాధారణమైపోయిన రోజుల్లో... అసలు ఆ
రోగాలు మన దరిదాపులకు రాకుండా ఉండాలంటే, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ
తీసుకోవాలి. పొరపాటున మన జోలికి వస్తే వాటిని ఎలా నియంత్రణలో పెట్టాలన్నదీ
ఆలోచించాలి. వైద్యం, ఆహార విధానం, వ్యాయామం, జీవనశైలి...దేన్నీ తక్కువచేయలేం.
ఆరోగ్య ప్రణాళిక అంతిమ లక్ష్యం...నా ఇంట్లో మందుల అరతో అవసరమేలేని రోజంటూ
రావాలి అన్నదే.
*హాబీలకూ ప్రణాళికలో స్థానం ఉండాలి. ఈ ఏడాది కూచిపూడిలో అరంగేట్రం చేయాలి...
రెండే*ళ్ళ *లో నేను వేయాలనుకున్న పెయింటింగ్లను పూర్తిచేసి ఓ ప్రదర్శన
పెట్టాలి...ఐదేళ్లనాటికి రచయితగా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి... ఇలా హాబీ
మనలోని సృజనని వెలికితీస్తుంది. ఆ శక్తిలో కొంత వృత్తిజీవితానికీ
మళ్ళిoచుకోవచ్చు.*
*నేర్చుకునే మనసుండాలే కానీ, వృక్షాలు మాట్లాడతాయి. రాళ్ళు ప్రవచిస్తాయి.
సెలయే**ళ్ళు** గ్రంథాలవుతాయి. ప్రయాణాల్ని మించిన వ్యక్తిత్వ వికాసమార్గం
లేదు.** **భారతదేశములో **కొత్తకొత్త ప్రదేశాలు, కొత్తకొత్త పరిచయాలు,
కొత్తకొత్త స్నేహాలు, కొత్తకొత్త అనుభవాలు... జీవితానికి కొత్త
ఉత్సాహాన్నిస్తాయి. కొత్త ఆలోచనల్ని ప్రసాదిస్తాయి. ఏడాదికి కనీసం
పదిహేనురోజులు ఏదో ఓ కొత్త ప్రదేశానికి వెళ్లడానికి కేటాయించుకోండి. అందుకయ్యే
ఖర్చులు, చేసుకోవాల్సిన ఏర్పాట్లు, అనువైన సమయం, బస, భోజనం...తదితర వివరాలన్నీ
పర్యాటక ప్రణాళికలో భాగం.*
పాతికేళ్ల వయసులోనూ నలభై ఏళ్ల వయసులోనూ ప్రపంచం మీ కళ్లకు ఒకేలా
కనిపించిందంటే, మీరు పదిహేనేళ్ల కాలాన్ని వృథా చేసినట్టే. ఎదిగేకొద్దీ పరిణతి
చాలా ముఖ్యం. ఉత్తమ సాహిత్యం, సత్సాంగత్యం మన ఆలోచనల మీద ప్రభావం చూపిస్తాయి.
ఆధ్యాత్మికత ప్రభావమూ చాలా ఉంటుంది. ఇది వికాస ప్రణాళిక.
పర్యాటకం, ఆర్థికం, హాబీలు, ఆరోగ్యం వగైరా వగైరా దేనికదే విడిగా అనిపిస్తున్నా
అంతస్సూత్రం ఒకటే. మీకిష్టమైన కూచిపూడిలో పద్మశ్రీ అవార్డు అందుకోడానికి
వీల్‌ఛెయిర్ మీద వెళ్లకూడదనుకుంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి. నచ్చిన ప్రాంతానికి
వెళ్లడానికి ఎవరి దగ్గరో చేయి చాచాల్సిన దుస్థితి రాకూడదంటే, ఆర్థికంగా ఉన్నత
స్థితిలో ఉండాలి. ఇవన్నీ ఒకదానితో ఒకటి విడదీయలేని అంశాలే. మీరూ మీ ఆలోచనలూ మీ
అలవాట్లూ మీ లక్ష్యాలూ మీ విజయాల్లా!
*వైఫల్యం వస్తే...*
ఎడిసన్ కథ మనకు తెలిసిందే. తన ప్రయత్నంలో ఎన్నోసార్లు విఫలమయ్యాడు. ఓ దశలో
నిరాశ కమ్మేసింది. ఇక తనవల్ల కాదేవో అనుకున్నాడు. అప్పుడే ఓ మిత్రుడు వచ్చాడు.
ఎడిసన్ మొహంలో కనిపిస్తున్న నిరాశానిస్పృహల్ని చూడగానే అతనికి విషయం
అర్థమైపోయింది.
'నీకు అన్నిటికంటే ఇష్టమైన పనేమిటి' అనడిగాడు...
'బల్బు తయారు చేయడం' నిర్వేదంగా చెప్పాడు ఎడిసన్.
'మరి, ఎందుకింత నిరాశ?'
'వేయిసార్లు విఫలమయ్యాను మిత్రమా'
'అలా ఎందుకనుకోవాలి? నీకు ఇష్టమైన పని వేయిసార్లు చేసే అవకాశం వచ్చిందని
అనుకోవచ్చుగా'
వైఫల్యాల్ని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మార్చుకోవచ్చో ఎడిసన్‌కు అర్థమై౦ది. ఈసారి
ఓటమి భయంలేకుండా పరిశోధన చేశాడు. విద్యుత్‌దీపాన్ని ఆవిష్కరించాడు.
నరేంద్ర ముర్కుంబీ అనే యువకుడు నానా కష్టాలూ పడి ఓ చక్కెర ఫ్యాక్టరీని
కొన్నాడు. ఎంత ఆలోచించినా దాన్ని నష్టాల్లోంచి ఒడ్డుకేయడం ఎలానో అర్థంకాలేదు.
దాదాపు ఆరునెలలు ఫ్యాక్టరీలోనే గడిపాడు. తిండీ నిద్రా అక్కడే. ఓ మూలనపడేసిన
చెరుకుపిప్పితో సహా...అణువణువూ పరిచయమైపోయింది. అప్పుడొచ్చిన ఆలోచనే... చెరుకు
పిప్పితో విద్యుదుత్పత్తి! ఆయన నాయకత్వంలోని 'గాయత్రి షుగర్' పదేళ్లలో
వేయికోట్ల టర్నోవరును అధిగమించింది. వైఫల్యం నేర్పే పాఠాలు ఇంత గొప్పగా
ఉంటాయి.
పడుతూలేస్తూ సరిదిద్దుకుంటూ సరిపుచ్చుకుంటూ ఓ అడుగు వెనకేస్తూ రెండడుగులు
ముందుకేస్తూ ధైర్యంగా ముందుకెళ్ళడమే జీవితం. ఆ ప్రయాణంలో ఓ ఆసరా... ప్రణాళిక.
విజయాక్షరాలు
మాట మంత్రాక్షరం. స్తబ్ధతను తరిమే చైతన్య అస్త్రం. దిశ చూపే దిక్సూచి. చీకటిని
గెలిచే దివిటీ. పుస్తకాల్లో రాసుకోండి. గోడమీద అతికించుకోండి. హృదయాల్లో
ప్రతిష్ఠించుకోండి. ప్రణాళికా రథానికి ఈ విజయాక్షరాలే...ఇంధనాలు. శ్రమ నీకు
ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది. అసాధ్యమైన దాన్నిఆశించు. కనీసం
అత్యుత్తమమైనదైనా అందుతుంది. విజయం అంటే, ఆశించినదాన్ని సాధించడం కాదు.
సాధించవలసిన దాన్ని అందుకోవడం. వనరులూ వసతులూ కాదు, ఎవరి విజయానికైనా ఆలోచనా
విధానమే మూలం. వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు. కొత్త ప్రేరణకు పునాది
కావాలి. ప్రయత్నించనిదే
ఫలితం లభించదు. సింహమైనా పడుకుని ఉంటే ఆహారం వచ్చి నోట్లోపడదు. గెలవాలన్న తపన
ఉన్నచోట, ఓటమి అడుగైనా పెట్టలేదు. ఈ రోజు మన జీవితం, నిన్నటి ఆలోచనల
ఫలితమే. పరాజయం
అంటే, నువ్వు చేసే పనిని వదిలి పారిపొమ్మని కాదు, ఆ పనిని మరింత శ్రద్ధగా
నేర్పుగా పట్టుదలగా చేయమని అర్థం. విజయం ఒక గమ్యం కాదు. గమనం మాత్రమే.
ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి జీవితంలో మరో అవకాశం ఉంటుంది. గొప్ప లక్ష్యాన్ని
సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు. గొప్ప లక్ష్యం లేకపోవడం
నేరం. అసంభవం అన్న పదం అసమర్థుల నిఘంటువుల్లోనే కనిపిస్తుంది. వజ్రసంకల్పం కలిగిన వ్యక్తి
ప్రపంచాన్నే తన అభీష్టానికి అనుగుణంగా మలచుకుంటాడు. ప్రతి చిన్న అవాంతరానికీ
సంకల్పాన్ని మార్చుకునేవారు లక్ష్యానికి దూరమవుతారు. అంతరాలు కలిగేకొద్దీ
సంకల్పాన్ని దృఢతరం చేసుకుంటూ పోవాలి. ఒక పని కష్టమని మనం దాన్ని చేయడానికి
భయపడం. మనం భయపడతాం కనుక ఆ పని కష్టమనిపిస్తుంది. ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు,
ఎదురునడుస్తూ పోవడమే విజయరహస్యం. విజయశిఖరాలు సోమరులకు అందవు. పట్టుదలతో
కృషిచేసే వారికి అవి తలవంచుతాయి. విజేత వెనక ఉండేది అదృష్టవో మంత్రదండవో
కాదు... చక్కని ప్రణాళిక, కఠిన శ్రమ, అంకితభావం.
విజయం అంటే, ఆశించినదాన్ని సాధించడం కాదు. సాధించవలసిన దాన్ని అందుకోవడం.
శ్రమ నీకు ఆయుధమైతే, విజయం నీకు బానిస అవుతుంది.
No comments:
Post a Comment